నోకియా జీ300 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. నోకియా లాంచ్ చేసిన అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. ఓజో ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డెడికేటెడ్ నైట్ మోడ్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


నోకియా జీ300 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 199 డాలర్లుగా(సుమారు రూ.15,000) నిర్ణయించారు. మీటియోర్ గ్రే కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెరికాలో దీని సేల్ అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


నోకియా జీ300 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. పవర్ బటన్ కూడా దాని పక్కనే ఉంది. ఇందులో 4470 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. క్వాల్‌కాం క్విక్ చార్జ్ 3.0ని కూడా ఇందులో అందించారు. దీని మందం 0.92 సెంటీమీటర్లుగా ఉంది.


Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?


Also Read: వన్‌ప్లస్ 9ఆర్‌టీలో ఈ ఫీచర్లు పక్కా.. అదిరిపోయే న్యూస్ చెప్పిన కంపెనీ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి