Gold Price Today 1st July 2022: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా మూడో రోజు పతనమైంది. రూ.110 తగ్గడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890కి పతనమైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,100 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,890, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,650 అయింది. 


నేడు ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 1st July 2022) 10 గ్రాముల ధర రూ.50,890 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


విశాఖపట్నం, తిరుపతిలో రూ.200 మేర తగ్గడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 అయింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.200 తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.65,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో రూ.160 తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,650 అయింది. 
చెన్నైలో బంగారంపై రూ.60 తగ్గడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,780 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,890గా ఉంది.


తగ్గిన ప్లాటినం ధర 
హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,350గా ఉంది. 
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,350 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,300కి చేరింది. 
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,350 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Delay In Mutual Funds Units: మీ MF యూనిట్లు ఆలస్యంగా క్రెడిట్‌ అయ్యాయని భయపడుతున్నారా?