Gold Price Today 11th June 2022: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పతనమైంది. రూ.210 మేర తగ్గడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100కి పతనమైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1000 తగ్గడంతో నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది.


నేడు ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 11th June 2022)  10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 కి క్షీణించింది. రూ.1,000 మేర తగ్గడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి


విశాఖపట్నం, తిరుపతిలో రూ.200 దిగిరావడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 అయింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో రూ.210 తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కి పతనమైంది. 
చెన్నైలో బంగారంపై రూ.230 తగ్గడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100గా ఉంది.


తగ్గిన ప్లాటినం ధర 
హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.24,170గా ఉంది. 
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,170 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,170కి చేరింది. 
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,170 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Ladli Laxmi Yojana Scheme: ఆడపిల్ల పుడితే రూ.1.30 లక్షలు ఇస్తున్న స్కీమ్‌! దరఖాస్తు ప్రాసెస్‌ ఇదీ!


Also Read: Volkswagen Virtus: ఫోక్స్‌వాగన్ వర్చూస్ వచ్చేసింది - మిడ్ రేంజ్ బడ్జెట్లో బెస్ట్ కారు!