Cryptocurrency Prices Today, 29 January 2022: బిట్‌కాయిన్‌ @ రూ.30.37 లక్షలు.. నేడు లాభాల్లో క్రిప్టోలు

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 3.12 శాతం పెరిగి రూ.30.37 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.53.47 లక్షల కోట్లుగా ఉంది.

Continues below advertisement

Cryptocurrency Prices Today, 29 January 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం లాభాల్లోనే సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేసేందుకు కాస్త ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 3.12 శాతం పెరిగి రూ.30.37 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.53.47 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ గత 24 గంటల్లో 6.14 శాతం పెరిగి రూ.2,05,128 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.22.74 లక్షల కోట్లుగా ఉంది. 

Continues below advertisement

బైనాన్స్‌ కాయిన్‌ 1.36 శాతం పెరిగి రూ.31,398, టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.80.54, కర్డానో 4.40 శాతం పెరిగి రూ.86.00, యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం తగ్గి 80.65, సొలానా 9.35 శాతం పెరిగి రూ.7,793 వద్ద కొనసాగుతున్నాయి. కోటి, సాండ్‌బాక్స్‌, సివిక్‌, క్వాంట్‌స్టాంప్‌, ఫైల్‌కాయిన్‌, నెమ్‌, అవలాంచె 9-12 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. నేడు ఠీటా ఫ్యూయెల్‌ మాత్రమే 2.22 శాతం నష్టపోయింది.

Also Read: Union Budget 2022 Telangana : ప్రతీ సారి నిరాశే.. ఈ సారైనా కనికరిస్తారా ? కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఎన్నో ఆశలు !

Also Read: Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Continues below advertisement
Sponsored Links by Taboola