Vijay Mallya Comments | తనకు దైవభక్తి చాలా ఎక్కువ అననీ చాలా గుళ్ళకి బంగారం సమర్పించాననీ ఆ దేవుడే తనను కష్టాల నుంచి కాపాడుతాడని అన్నారు విజయ్ మాల్యా. RCB జట్టు ఒకప్పటి ఓనర్ గా ప్రస్తుతం విజయ్ మాల్యా ఇంటర్యూలూ ఆయనకు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదానిలో అయినా చాలా ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.
శబరిమల పైకప్పుకు బంగారం ఇచ్చింది నేనే : విజయ్ మాల్యా
మీకు దేవుడిపై నమ్మకం ఉందా అనే ఒక ప్రశ్నకు విజయ్ మాల్యా సమాధానం ఇస్తూ తనకు దేవుడంటే చాలా గట్టి విశ్వాసం ఉందని దేశంలోని చాలా గుడ్లను సందర్శించానని చెబుతూ ఎక్కువగా దక్షిణ భారతదేశంలోని ఆలయాలకు పెడుతూ ఉంటానని అన్నారు. అలాగే ప్రముఖ దేవాలయాలకు చాలా కానుకలు సమర్పించానని ముఖ్యంగా శబరిమల దేవాలయం పైకప్పు మొత్తం బంగారం తో తాపడం చేయించిందని తానేనని తెలిపారు. అలాగే తిరుమల దేవాలయం గర్భగుడి పైన ముందర భాగానికి బంగారం ఇచ్చింది కూడా తానేనని మాల్యా అన్నారు. అలాగే మూకాంబిక, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలకు ధ్వజస్తంభాలు డొనేట్ చేసింది తానేనని చెప్పుకొచ్చారు. ఎన్ని దానాలు చేసినా కష్టాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు దేవుడిపై విశ్వాసం ఉందని ఎలాంటి కష్టాలు ఎదురైనా చివరికి ఆయనే తనను కాపాడుతాడని నమ్ముతున్నానని అన్నారు విజయ మాల్యా.
బ్యాంకులకు భారీగా బకాయిలు.. విదేశాలకు వెళ్ళిపోయిన మాల్యా
ఒకప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో "షో మ్యాన్ " గా పేరుపొందిన విజయ్ మాల్యా బ్యాంకులకు భారీగా అప్పు పడడం తో ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు . మనకు సంబంధించిన అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్సీబీ వ్యవస్థాపకుడుగా ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆజట్టు ఐపిఎల్ 2025 ట్రోఫీ గెలవడంతో విజయ్ మాల్యా పేరు మరొకసారి వైరల్ అవుతోంది. ఆమధ్య ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విశేషాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.