Elon Musk Satellite Internet: ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారత్ లో ఇంటర్నెట్ సేవలు అందించడానికి అవసరమైన లైసెన్స్ పొందింది. స్పేస్‌ఎక్స్ ద్వారా అందించే శాటిలైట్ ఇంటర్నెట్ , భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (సాట్‌కామ్) సేవలను అందించడానికి భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. స్టార్‌లింక్‌కు భారతదేశ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుండి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ లభించింది. ఇప్పటి వరకు ఇలాంటి లైసెన్స్ యూటెల్‌సాట్ వన్‌వెబ్ , జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ కు మాత్రమే ఉన్నాయి.స్టార్ లింగ్ ఈ లైసెన్స్ పొందిన మూడవ సంస్థ.
2025 మే 7న DoT స్టార్‌లింక్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయింది. భద్రతా నిబంధనలను, డేటా సెక్యూరిటీ, జాతీయ భద్రతా మార్గదర్శకాలను పాటించేందుకు స్టార్‌లింక్ హామీ ఇచ్చింది. మరికొన్ని షరతులను పూర్తి చేయడంతో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుండి అదనపు అనుమతులు స్టార్ లింక్ పొందాల్సి ఉంటుంది. 2025 మార్చిలో, స్టార్‌లింక్ భా రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యాలు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను పంపిణీ చేయడానికి నగర, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ కవరేజ్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. జియో , ఎయిర్‌టెల్ తమ రిటైల్ స్టోర్‌లు , ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తాయి, వీరి మార్కెట్ వాటా కలిపి భారత టెలికాం మార్కెట్‌లో 70 శాతం కంటే ఎక్కువ.
స్టార్‌లింక్ సుమారు 7,000 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్‌లను ఉపయోగిస్తుంది. అధిక-వేగం, తక్కువ లేటెన్సీ బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది. సాంప్రదాయ జియోస్టేషనరీ శాటిలైట్‌లకు భిన్నంగా, LEO శాటిలైట్‌లు 550 కి.మీ ఎత్తులో ఉంటాయి, లేటెన్సీని తగ్గిస్తాయి మరియు స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి వాటికి ఈ ఇంటర్నెట్ బాగా ఉపయోగకరం. ఇది పూర్తి వైర్ లెస్. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులో ఉండని గ్రామాలకు ఉపయోగపడుతుంది. స్టార్‌లింక్ కిట్ కొంటెనే ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకోగలరు. ఇందులో శాటిలైట్ డిష్, వై-ఫై రూటర్, కేబుల్స్, పవర్ సప్లై ఉంటాయి. ఈ కిట్ 30 నుంచి యాభై వేల వరకూ ఉంటుంది. నెలావారీ ఇంటర్నెట్ చార్జీలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వైర్లు లేకుండా చిన్న శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతాయి. మరో ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది