Warangal Municipal Corporation Employees: ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి, జీతం ఇచ్చి.. పనులు చేయండ్రా అని పంపితే .. వారు చేస్తున్న పనులు మాత్రం వేరే ఉన్నాయి. కుర్చీలో కూర్చుని పని చేయకుండా.. తోటి ఉద్యోగినితో ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. ఇద్దరూ కొత్తగా చేరిన వారే. ప్రేమలో ఉన్నారో.. దోమలు కుడుతున్నాయని కంగారు పడుతున్నారో కానీ.. ఉద్యోగానికి వచ్చినప్పటి నుండి అదే పని. దాంతో చిరాకేసిన కొంత మంది కిటీకీ నుంచి వీడియో తీసి.. వారి బాగోతాన్ని సోషల్ మీడియాలో పెట్టారు.  

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.  విధులు  నిర్వహించాల్సిన వీరు ముద్దు ముచ్చట తో రాసలీలల్లో మునిగిపోయారు. నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ పనులకోసం కార్పొరేషన్ కార్యాలయానికి వస్తూంటారు. వారు అదే పనిగా తిరగడం తప్ప పనులు కావు. ఎందుకంటే.. ఉద్యోగులు ఇలాంటి పనులు చేస్తూంటారు.  కార్పొరేషన్ కార్యాలయంలోని ఎకౌంట్స్ విభాగంలో రెగ్యులర్  ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఇద్దరూ అకౌంట్స్ సరి చేసుకోవడానికే సమయం ఉండదు. ఇక ఇతర పనులు ఎక్కడ చేస్తారు. 

బిల్లులు రావాల్సిన వారు.. మంజూరు కావాల్సిన వారు అదేపనిగా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంటారు. పనులు కావు. వీరినిర్వాకాలు చూసి చాలా మంది గుట్టు బయట పెట్టాలనుకున్నారు.   రాసలీలల్లో మునిగిపోయిన సమయంలో కార్యాలయానికి వచ్చిన ఎవరో వీడియో చిత్రీకరించారు. అయితే ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. రాసలీలల పై ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు మందలించారు. రాసలీలలు పాల్పడిన ఇద్దరి పై అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారా.. లేక మందలించి వదిలేస్తారా వేచి చూడాలి.

ఈ ఇద్దరూ ఉద్యోగులు కొత్తగా చేరిన వారని చెబుతున్నారు. తాము ప్రేమలో ఉన్నామని వారు సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు.  ప్రేమలో ఉంటే ఆపీసులో ముద్దులు పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.