PM Modi inaugurates engineering marvel built in Kashmir : జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. భారత రైల్వే చరిత్రలో ఈ వంతెన నిర్మాణం ఒక మైలురాయిగా నిలిచింది, ఈ వంతెన కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన భాగాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానం చేసే ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో కీలక భాగం.[
ఈ రైల్వే వంతెన నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి - కాట్రా వరకూ డైరెక్ట్ గా ట్రైన్లో వచ్చేయొచ్చు. ఇంకో వైపున బారాముల్లా నుంచి శ్రీనగర్ మీదుగా రైల్వే లైన్ ఉంది. ఈ రెండు లైన్ల మధ్యలో ఎత్తైన కొండలు, లోయలు నిండి ఉంటాయి. ఈ కారణంగా ఇన్నాళ్లు రైల్వే లింక్ ఉండేది కాదు. దానితో బయట రాష్ట్రాల నుంచి శ్రీనగర్ రావాలంటే ఫ్లైట్ ద్వారానో లేక జమ్ము వరకూ ట్రైన్ లో వచ్చి అక్కడినుంచి రోడ్డు మార్గాన రావడమో అప్షన్ గా ఉండేది. అందుకే బారాముల్లా -శ్రీనగర్ = ఉద్ధంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ప్రభుత్వం.
అత్యంత ఎత్తులో కొండలను తవ్వి సొరంగాలు )ఏర్పాటు చేస్తూ నిర్మించారు. ఈ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గా చెబుతున్నారు రైల్వే అధికారులు. పర్వతాలు, లోయలు, విపరీతమైన చలి గాలులతో నిండి ఉండే ఈ ప్రాంతంలో అంత ఎత్తులో నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం ఒక సాహసమనే చెప్పాలి. దాన్ని సవాల్ గా స్వీకరించిన రైల్వే శాఖ 1315 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మించింది. అనేక డిజైన్లు పరిశీలించిన తర్వాత "ఆర్చి " మోడల్ లో ఈ బ్రిడ్జిని కట్టారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి తో పాటు ఎత్తైన ఆర్చ్ మోడల్ బ్రిడ్జ్ గానూ చినాబ్ రైల్ బ్రిడ్జి రికార్డు సృష్టించింది.