The annual Teppotsavams in Tiruchanoor Temple:  జూన్  ఏడు నుంచి పదకొండో తేదీ వరకూ తిరుచానూరు పద్మావతి అణ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఏటా జ్యేష్ఠమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఈ తెప్పోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాన్ని చూసి తరించే భక్తులుకు తిప్పలు తప్పుతాయని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. 

తెప్పోత్సవంలో పాల్గొంటే సంసారంలో దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. పద్మసరస్సులో బంగారుపద్మం నుంచి ఆవిర్భవించింది అలమేలుమంగ. మాతృమూర్తిగా జీవకోటి భజజలసమాధిలో మునిపోకుండా రక్షించి సర్వ సుఖాలు ప్రసాదిస్తుందని ఈ తెప్పోత్సవం వెనుకున్న ఆంతర్యం.

జూన్ 07 శనివారం రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణుడు 

జూన్ 08 ఆదివారం  శ్రీ సుందరరాజస్వామి

జూన్ 09,  10, 11...సోమవారం,మంగళవారం, బుధవారం ఈ మూడు రోజులు  శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు

తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 07 శనివారం రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య శ్రీకృష్ణుడు, ఆ తర్వాత రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో విహరిస్తారు. 

జూన్ 10 మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిమధ్యలో గజవహానంపై అమ్మవారు అనుగ్రహిస్తారు

జూన్ 11 బుధవారం రాత్రినిమిదిన్నర నుంచి పదిమధ్య గరుడ వాహనంపై అమ్మ ఆసీనులవుతుంది

జూన్ 14 ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది పద్మావతి తెప్పోత్సవాల సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 07 నుంచి 11 వరకూ ఐదు రోజుల పాటూ జరగనున్న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ రద్దు చేశారు.

ఈ సందర్భంగా  TTD హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

శ్రీ పద్మావతీ స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షఃస్థలస్థితే |పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే ||  

వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే |పద్మే రమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 

కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే |కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే ||  

సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే |పద్మపత్రవిశాలాక్షి పద్మావతి నమోఽస్తు తే || 

సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని |సర్వసమ్మానితే దేవి పద్మావతి నమోఽస్తు తే ||  

సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే |అష్టైశ్వర్యప్రదే లక్ష్మి పద్మావతి నమోఽస్తు తే ||  

దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనమ్ |అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోఽస్తు తే ||  

నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే |కృపయా పాహినః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే||  

ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికామ్ |భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ ||  

కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః |శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళమ్ || 

ఇతి శ్రీ పద్మావతీ స్తోత్రమ్ |

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి