Cryptocurrency Prices Today, 26 December 2021: క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి.  కీలక క్రిప్టోలను ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 2.03 శాతం తగ్గి రూ.39.76 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.70.71 లక్షల కోట్లుగా ఉంది.  బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 0.87 శాతం తగ్గి రూ.3,21,813 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.35.93 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 0.92 శాతం తగ్గి రూ.43,369, టెథెర్‌ 0.16 శాతం తగ్గి రూ.79.94, సొలానా 0.35 శాతం పెరిగి రూ.15,477, రిపుల్‌ 1.89 శాతం తగ్గి రూ.72.97, కర్డానో 0.02 శాతం పెరిగి రూ.114 వద్ద కొనసాగుతున్నాయి. కర్వ్‌ డావో, కాస్మోస్‌, ఆగుర్‌, పాలీగాన్‌, ఠీటా నెట్‌వర్క్‌, గోలెమ్‌, చిలిజ్‌ 3 నుంచి 12 శాతం వరకు లాభపడ్డాయి. ఫెచ్‌ ఏఐ, ఐఈక్సీ ఆర్‌ఎల్‌సీ, యార్న్‌ ఫైనాన్స్‌, లైట్‌కాయిన్‌, ఎన్‌కేఎన్‌, ఆవె, లైవ్‌పీర్‌ 4 నుంచి 6 శాతం వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.


Also Read: RBI Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆన్‌లైన్‌ పేమెంట్‌ నిబంధన గడువులో మార్పు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే?


Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!


Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


Also Read: Cyber Crime: మీ మొబైల్‌ ఫోన్‌ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి