క్రిప్టో కరెన్సీ బిల్లుపై మరో అప్‌డేట్‌! పార్లమెంటు శీతకాలం సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టడం లేదని తెలిసింది. అసలీ బిల్లుకు కేబినెట్‌ ఇంకా ఆమోదమే తెలపలేదని సమాచారం. అత్యవసరం అనిపిస్తే కేంద్ర ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ ఇండియా అంచనా వేసింది.


కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లును శీతకాల సమావేశాల్లో పార్లమెంటులో పెడుతుందని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. మొదట్లో క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్లాక్‌చెయిన్‌ సాంకేతికతను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో బిల్లు పేరును మార్చారు. నిషేధం కన్నా నియంత్రణే మేలన్న నిర్ణయాన్ని వచ్చారని తెలిసింది. చట్టానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ పూర్తికాకపోవడంతో పార్లమెంట్‌ టేబుల్‌ మీదకు తీసుకురాలేదని సమాచారం.


డిజిటల్‌ కరెన్సీ నిబంధనలు, నియంత్రణపై తుది నిర్ణయానికి వచ్చే ముందు నిపుణులతో సుదీర్ఘ సంప్రదింపులు చేపట్టాలని మోదీ ప్రభుత్వం భావించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు డిసెంబర్‌ 23న ముగుస్తుండటంతో సమయం సరిపోదని నిర్ణయించుకుంది. పైగా బిల్లును ఇంకా కేబినెట్‌ ఆమోదించలేదు. పార్లమెంట్‌ వెబ్‌సైట్‌ చూసినా బిజినెస్‌ జాబితాలోంచి క్రిప్టో కరెన్సీ బిల్లును తొలగించినట్టు కనిపిస్తోంది. కావాలనుకుంటే సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశం ఉంది.


క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకొస్తున్నారని తెలిసిన రోజు నుంచి భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కాయిన్ల విలువ పతమవుతోంది. కొన్ని రోజులుగా బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. అదే బాటలో ఎథిరియమ్‌ సహా మిగిలినవీ పయనిస్తున్నాయి. మార్కెట్లు ఇంకా ఎన్నాళ్లు స్తబ్దుగా ఉంటాయో తెలియడం లేదు. పెట్టుబడులు పెట్టినవారు అయోమయంలో ఉన్నారు.


Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్‌ చూడండి మరి!


Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్‌..! ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ


Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్‌ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!


Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!


Also Read: Minister KTR: చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు సరికాదు.... కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ... చేనేత రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం


Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ విలువ