దేశీయ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభం, మదుపర్లు వేచి చూసే ధోరణి కనబరచడం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో కదలాడటంతో నిఫ్టీ, సెనెక్స్‌ బుధవారం ఆద్యంతం ఊగిసలాడాయి. స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అయితే బెంచ్‌మార్క్‌ సూచీలను మిడ్‌క్యాప్‌, మీడియా సూచీలను అధిగమించడం గమనార్హం.


Also Read: Hyderabad Raid Today: కార్వీ ఆఫీసు, ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు.. బెంగళూరు పోలీసుల కస్టడీకి మాజీ ఎండీ పార్థసారధి


ఉదయం 59,064 వద్ద ఆరంభమైన బీఎస్‌ఈ సెనెక్స్‌ సెషన్‌ మొత్తం ఊగిసలాడింది. 59,163 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. చివరికి 58,927.33 వద్ద 77 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ ఈ వారంలో 60వేల మైలురాయి దాటుతుందని అంచనా వేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,580 వద్ద మొదలై 17,607 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని చివరికి 15 పాయింట్లు నష్టపోయి 17,546 వద్ద ముగిసింది.


Also Read: China Evergrande Crisis: 22 లక్షల కోట్ల అప్పు! భయం ముగింట్లో ప్రపంచం.. భారత్‌పై ప్రభావం ఏంటి?


* నిఫ్టీలో కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎం రాణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నష్టాల బాట పట్టాయి.


* ఐపీవోకు వస్తున్న పరాస్‌ డిఫెన్స్‌, స్పేస్‌ టెక్నాలజీ సంస్థకు మంచి డిమాండ్‌ వస్తోంది. ఇప్పటికే 34.19 రెట్ల స్పందన లభించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 60, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 16.90 శాతం షేర్లు కేటాయించారు.


* ఈ రోజు జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సోనీలో విలీనం కావడంతో నిఫ్టీ మీడియా సూచీ ఏకంగా 15.77 శాతం పెరిగింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ధర ఏకంగా 34 శాతం ఎగబాకింది. ఆ తర్వాత ఐనాక్స్‌  లీజర్‌ 14 శాతం లాభపడింది.


* స్టాక్‌ మార్కెట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో రూ.50కోట్లు లాభం గడించారు. వారం రోజుల క్రితమే ఆయన సంస్థ రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌.. జీ కు చెందిన 50 లక్షల షేర్లను రూ.220.44 వద్ద కొనుగోలు చేసింది. ఈ రోజు ఆ షేరు రూ.321కి చేరుకోవడం షేరుకు వంద రూపాయాల చొప్పున రూ.50 కోట్లు సంపాదించారు.


Also Read: ZEE Merging with Sony: విలీనమైన దిగ్గజ మీడియా సంస్థలు.. జీ-సోనీ మధ్య ఒప్పందం, పూర్తి వివరాలివీ..


* డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 26 పైసలు పెరగడంతో రూ.73.87 వద్ద ముగిసింది. చైనా మార్కెట్లలో ఒత్తిడి రూపాయిపై సానుకూల ప్రభావం చూపించిందని అంటున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.