ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి, తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు 2022 వరకు ఉద్యోగుల షేర్‌తో పాటు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈపీఎఫ్ఓ కింద నమోదు చేసుకున్న సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన కింద పీఎఫ్ ఖాతాదారులకు మరింత కాలం మద్దతు అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. కంపెనీ కంట్రిబ్యూషన్ కూడా తామే చెల్లిస్తామని పేర్కొన్నారు. అంటే కేంద్రమే 24 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తుందన్నమాట.
ALSO READ: JK Encounter: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
ఈ అవకాశం 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంచుతామని నిర్మలా వెల్లడించారు. సాధారణంగా అయితే ఈ బెనిఫిట్ ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ నెలలో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. రూ.15 వేలలోపు వేతనం కలిగిన వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.
Also Read: Afghanistan Crisis: 150 మంది భారతీయులు కిడ్నాప్.. అందరూ సురక్షితమే!