ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా బొలెరో నియో మోడల్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. నియో మోడల్‌లో ఎన్‌10 (ఓ) అనే వేరియంట్‌ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా తన నియో వేరియంట్‌ను జూన్ నెలలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్‌4, ఎన్‌8, ఎన్‌10 అనే మూడు వేరియంట్లలో దీనిని విడుదల చేయగా.. తాజాగా ఎన్‌10 (ఓ) మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, నేపోలీ బ్లాక్, రాకీ బేజ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. దీని ధర ఎక్స్ షోరూం ప్రకారం రూ.10.69 లక్షలుగా ఉంది.





నియో ఎన్‌10 వేరియంట్ ఫీచర్లే దాదాపుగా ఎన్‌10 (ఓ)లోనూ ఉన్నాయి. వీటికి అదనంగా ‘మెకానికల్‌ లాకింగ్‌ రేర్‌ డిఫరెన్షియల్‌’ అనే ఫీచర్ ఎన్‌10(ఓ)లో అందించారు. బొలెరో నుంచి ఇంతకుముందు వచ్చిన వెర్షన్‌ల మాదిరి కాకుండా, ఇందులో కొన్ని ప్రత్యేకమైన కంఫర్టను అందించారు. నగరాల్లో నివసిస్తున్న యువత కోసం ఈ ఫీచర్లు అందించినట్లు తెలుస్తోంది.  


Also Read: Volkswagen Taigun: సెప్టెంబర్‌లో వోక్స్ వేగన్ టైగన్ ఎస్‌యూవీ.. ప్రారంభమైన ప్రీ బుకింగ్స్


బొలెరో నియో ఎన్‌10(ఓ) స్పెసిఫికేషన్లు..
బొలెరో నియో ఎన్‌10(ఓ) మోడల్‌లో 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 100 బీహెచ్‌పీ పవర్.. 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో రానుంది. ఇందులో ఆటోమెటిక్ వేరియంట్ కారులో ఏమేం ఫీచర్లు ఉంటాయనే విషయాన్ని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. 


బొలెరో నియో ఎన్‌10(ఓ) మోడల్‌లో రివైజ్డ్‌ డీఆర్‌ఎల్‌ హెడ్‌ ల్యాంప్స్‌, కొత్త ఫ్రంట్‌ బంపర్‌, న్యూ ఫాగ్‌ ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు లోపలి భాగాలు.. టీయూవీ 300 మోడల్‌ను పోలి ఉంటాయి. ఇందులో బ్లూటూత్‌తో కూడిన 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంటుంది. దీంతో పాటు క్రూజ్‌ కంట్రోల్‌, స్టీరియో మౌంటెడ్‌ ఆడియో కంట్రోల్స్‌, బ్లూ సెన్స్‌యాప్‌ కూడా ఉన్నాయి.  


Also Read: Tata EV Sedan Tigor: టాటా నుంచి టైగోర్ కారు.. వచ్చే వారంలో రిలీజ్.. ధర ఇంత ఉంటుందా?


Also Read: Tata Tigor EV: టాటా నుంచి సూపర్ ఫీచర్స్‌తో మరో ఎలక్ట్రిక్‌ కారు.. అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..