ఆయ్...మా ఆత్రేయపురం పూతరేకులు ఎప్పుడైనా తిన్నారా...నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయ్... అని తరచూ వింటుంటాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులు అంత ఫేమస్ మరి. ఇప్పుడు మరో ఘనత వాటి సొంతమైంది. ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ పోస్టల్ కవర్ రూపొందించింది. ఆత్రేయపురం కార్యాలయం వద్ద విశాఖపట్నం రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ముత్యాల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఈ పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు. ఆత్రేయపుర పూతరేకులకు ఏళ్ల చరిత్ర ఉంది. వీటి తయారీపై సుమారు 500 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. 


అన్ని తపాలా కేంద్రాల్లో 


పూతరేకులు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఏపీలోని అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్ కవర్ అందుబాటులో ఉండనుంది. పూతరేకుల పోస్టల్ కవర్ ధర రూ.20 అని పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 


పూత రేకులకు మంచి క్రేజ్


నేతివాసనలతో ఘుమఘుమలాడే మధురమైన తియ్యదనాన్ని పల్చని పొరలుగా పేర్చి నోరూరించే వంటకంగా మలిస్తే అదే పూతరేకు. స్వీట్ వెరైటీల్లో పూత రేకు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ ఆత్రేయపురం పూత రేకులకు ఉన్న క్రేజే వేరు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తుంటారు. పూతరేకులు చేయడం ఒక కళ. ఈ కళకు తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం చాలా ప్రసిద్ధి. ఈ మండల పరిధిలోని గ్రామాలు వారు పూతరేకుల తయారీతో నిష్ణాతులు. 


Also Read:భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్


తయారీ ఇలా...


పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతుంటారు. కుండను నున్నగా గుండ్రంగా చేసుకుని, కుండకు రంధ్రం చేసి కింద వైపు కట్టేలుపెడతారు. ఇడ్లీకి వాడే విధంగా మినప, వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసి ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా మంట పెడతారు. కుండ వేడెక్కుతుంది. సిద్ధం చేసుకున్న పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది దీనినే రేకుగా పిలుస్తారు. ఈ రేకులో తీపి పదార్థాలు, నెయ్యి వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. నెయ్యి, బెల్లం లేదా పంచదార పొడి, జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారుచేస్తారు. 


 


Also Read: Pawan Kalyan: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు