భోజ్‌పురి తారామణుల ప్రైవేటు వీడియోలు అదే పనిగా ఇంటర్నెట్‌కు ఎక్కుతున్నాయి. కావాలని పాపులారిటీ కోసం చేస్తున్నారో లేక నిజంగానే యాక్సిడెంటల్‌గా లీకవుతున్నాయో తెలియదు కానీ హాట్ హాట్ వీడియోలు మాత్రం నెటిజన్ల కోసం వెల్లువలా వస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి ప్రియాంక పండిట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఆమె ప్రైవేటు వీడియో. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదని ఆమె చెబుతోంది. తన ఇమేజ్‌ను భంగం కలిగించడానికి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ప్రియాంంకా పండిట్ అంటున్నారు. ఈ ప్రైవేటు వీడియో ఎలా బయటకు వచ్చిందో ఆమె చెప్పడం లేదు. లీకయినందుకు పెద్దగా బాధపడటం లేదు.
వారం రోజుల కింట.. త్రిషకర్ మధు అనే ప్రముఖ బోజ్‌పురి వీడియో కూడా వైరల్ అయింది. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో అది. ఇప్పటికీ ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్ చేసి సరి పెట్టారు. వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ వీడియోలను నెట్ నుంచి తీసేయాలని సోషల్ మీడియా సంస్థలనూ కోరలేదు.
మన్న త్రిషకర్..ఇప్పుడు ప్రియాంక పండిట్.. ఇద్దరూ భోజ్‌పురి నటులే. త్రిషకర్‌కు దేశవ్యాప్తంగా ఆ వైరల్ వీడియో వల్ల గుర్తింపు రావడంతో.. పోటీగా ప్రియాంక కూడా వీడియో రిలీజ్ చేసిందని నెటిజన్లు విమర్శలు ప్రారంభించారు. పబ్లిసిటీ కోసమే భోజ్‌పురి హీరోయిన్లు ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు.ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని అంటున్నారు. "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు ఆ తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్‌లో నటించి పాపులర్ అయింది.
ఈ వీడియోలు లీక్ అయినందుకు తారామణులు బాధపడటం లేదు. సరి కదా మరింత పబ్లిసిటీ వచ్చేలా ప్రకటనలు చేస్తున్నారు. తమకు తెలియకుండా లీక్ అయితే వారు పోలీసులకు ఫిర్యాదు లు చేస్తారు. కానీ వీరు మాత్రం సోషల్ మీడియాలోనే ప్రకటనలు ఇచ్చి తమకు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో లెక్కలేసుకుంటున్నారు. వీరు గుర్తింపు కోసం కావాలనే లీకులు చేసుకుంటున్నారని నెటిజన్లు ఓ అభిప్రాయానికి రావడానికి ఇదే కారణం.