ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్ముకశ్మీర్ అంవతిపొరాలోని త్రాల్ లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. వీరంతా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్ సహా మరి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


Also Read: Telugu Politics In Delhi : తెలుగు ప్రాంతీయ పార్టీలు బీజేపీ పక్షమేనా..? సోనియాతో భేటీకి ఎందుకు డుమ్మా ?










త్రాల్ లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని అంతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. 


శుక్రవారం ఉదయం ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టిన తర్వాత నేడు ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్​లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ఉగ్రవాదుల ఏరివేత చేపడుతోంది. ఉగ్రవాదులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భద్రతా దళాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి.


Also Read: Coronavirus India Live Updates: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 151 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు