ఆగస్టు 14న పాకిస్తాన్ లో మహిళా టిక్ టాకర్ పై వందల మంది మూకుమ్మడి దాడి ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ దాడిని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఆ దాడి జరిగిన రోజే పాకిస్తాన్ లో మరో మహిళపై దాడి జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిని ఖండిస్తూ సోషల్ మీడియా యాష్ టాగ్ లు నడుస్తున్నాయి.
మహిళపై బైకర్ లైంగిక దాడి
సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోలో ఇద్దరు మహిళలు రద్దీగా ఉండే రోడ్డుపై ఓపెన్ రిక్షాలో ప్రయాణిస్తుండగా, ఫుట్‌బోర్డ్ పై నుంచి ఓ వ్యక్తి అమాంతం రిక్షాలోకి ఎక్కి మహిళ చెంపపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో ఆధారంగా పాకిస్థాన్‌లో రద్దీగా ఉన్న ఓ వీధిలో ప్రయాణిస్తున్న రిక్షాలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నారు. (సోషల్ మీడియాలో చాలా మంది ఆ ప్రాంతం లాహోర్ అని చెబుతున్నారు)
ఎవరూ అడ్డుకోలేదు
ఇద్దరు మోటార్ సైకిలిస్టులు రిక్షాను వెంబడించి మహిళలను వేధించడం మొదలుపెట్టారు. ఓపెన్ రిక్షాలో ఉన్న మహిళల వైపుగా వచ్చిన ఓ యువకుడు రిక్షాపైకి దూకి, బలవంతంగా ఆ మహిళను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో మహిళ భయంతో గట్టిగా అరిసింది. కానీ ఆమె పక్కనున్న మహిళ కానీ ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోలేదని జియో టీవీ తెలిపింది. బైకర్ ప్రవర్తనతో విసిగిపోయి పక్కనున్న మహిళ తన చెప్పు తీసి హెచ్చరించింది. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మహిళ రిక్షాను దిగివెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. పక్కనున్న మహిళ ఆమెను వారించింది.
Also Read: Bhumika Chawla: దట్ ఈజ్ భూమిక.. రవిబాబు వద్ద ఆ విషయం దాచి షూటింగ్, నిజం తెలిసి అంతా షాక్!
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే...
మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఇటువంటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో పరిశీలిస్తే రిక్షా చుట్టూ చాలా కార్లు ఉన్నాయి. వాళ్లంతా జాతీయ పతాకాలు పట్టుకుని ఉన్నారు. దీంతో ఈ ఘటన పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు రాత్రి జరిగి ఉంటుందని తెలుస్తోంది.
" మహిళా టిక్ టాకర్ పై దాడి జరిగినప్పుడు ఎవరినో నిందించి, ఆమెది కూడా తప్పు ఉందని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ. వీళ్లు టిక్ టాకర్లు కాదు. అయినా దాడులు ఆగడంలేదు. అలాంటి ప్రవర్తనను ఆహ్వానిస్తారా ? మహిళలు సురక్షితంగా ఉన్నారా? ఎవరైనా వింటున్నారా?" అని అస్మత్ అలీ జైన్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.
నెటిజన్లు ఆగ్రహం
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు లాహోర్‌లో 400 మంది పురుషులు మహిళపై క్రూరంగా దాడి చేశాడు. బట్టలు చింపేస్తూ విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశారు. ఈ దాడి ఘటనను ఖండిస్తూ #minarPakistan # 400 మంది పురుషులు హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆగస్టు 14న మినార్-ఇ-పాకిస్తాన్ సమీపంలో టిక్ టాకర్ పై దాడి జరిగింది. దాదాపు 400 మంది ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.