రామాయణం అంతా విని రాముడికి సీత ఏమువుతుంది అని అడిగేవారిని గూట్లే అని తిడితే ఏమనుకుంటారు..? గూట్లే అంటే ఏమిటండి అని అడుగుతారు..! ఇలాంటి వాళ్లు పాకిస్తాన్‌లో కోకొల్లలుగా ఉన్నారు. వీళ్లను ప్రత్యేకంగా బయటకు తేవాల్సిన పని లేదు. వారంతటకు వారే వస్తారు. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. ఆ సందర్భంగా చిన్నా.. పెద్దా సెలబ్రిటీలు ఉందరూ తమ దేశ ప్రజలకు శుభాకాంక్షాలు చెప్పారు. అలాగే మెహ్‌విష్ హయత్ అనే నటి కూడా తమ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పింది. సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి.. దాని కింద " ఐక్యమైన ప్రయత్నం.. దేవుడిపై విశ్వాసం ఉన్నప్పుడే మనం కలల పాకిస్తాన్‌ని వాస్తవంగా మార్చగలము. జెండాను ఎగురవేయడం సరిపోదు, నిజంగా ఈ దేశాన్ని గౌరవిస్తే .. ఆదర్శంగా ఉండాలి .. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..." అని రాసుకొచ్చింది.
మనం భారతీయులందరూ సహోదరులు...సోదరీమణులు అని చెప్పుకుంటున్నట్లే... ఆమె కూడా తోటి పాకిస్తానీయులందరూ సోదరులు..సోదరీమణులు అనుకుని శుభాకాంక్షలు చెప్పింది. అయితే అక్కడ జనం మాత్రం అలా అనుకోలేదు. ఆమె తెల్లని డ్రెస్ వేసుకుని పాకిస్థాన్ జెండా పట్టుకుని దిగిన ఫోటోను పెట్టి శుభాకాంక్షలు చెప్పింది. కానీ పాకిస్థాన్ ప్రజలు మాత్రం ఆమె డ్రెస్‌ను చూడలేదు.. చేతిలో ఉన్న పాకిస్థాన్ జెండాను చూడలేదు.. ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయం అని కూడా చూడలేదు... వారి చూసిందల్లా... ఆమె తెల్లని డ్రెస్ వెనుక వేసుకున్న బ్రా కలరేంటి అని. అంతే ఆమె ఆ శుభాకాంక్షలు చెప్పిన సోషల్ మీడియా ఖాతాల్లోనే హయత్ వేసుకున్న బ్రా కలర్ గురించి చర్చలు ప్రారంభించేశారు. దీన్ని చూసి ఆ నటికి పిచ్చెక్కిపోయింది. ఆమె ఎలాంటి పాకిస్తాన్‌ను ఆశించిందో పోస్టులో చెప్పింది .. కానీ ఇక్కడ అదే పోస్టు కింద జరుగుతున్న చర్చ చూసి.. సహనం కోల్పోయింది.
మనషులు ఎంత వక్రబుద్దితో ఉన్నారో దీన్ని బట్టి తెలిసిపోతోందని మండిపడ్డింది. బ్రా కలర్ ఏదైతే మీకేంటని ప్రశ్నించింది. పాకిస్థాన్ కోసం పరిష్కరించాల్సిన అవసరం ఉన్న పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటిపై సమయం వెచ్చించాలని నెటిజన్లరు హయత్ సూచించారు. నిజానికి పాకిస్తాన్‌లో మహిళకు కనీస గౌరవం దక్కదు. నటీ నటుల్ని కూడా నీచంగా చూస్తారు. హయత్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. అయితే తమ దేశం.. తమ దేశ ప్రజలు ఎదుగుతున్నారని ఆమె అనుకుంది. కానీ ఎదగలేదు.. దిగజారిపోయారని తన బ్రా కలర్‌పై చర్చ పెట్టినప్పుడే అర్థమైపోయి ఉంటుంది.