Bhumika Chawla: దట్ ఈజ్ భూమిక.. రవిబాబు వద్ద ఆ విషయం దాచి షూటింగ్, నిజం తెలిసి అంతా షాక్!
భూమిక అనగానే.. ఆమె అందం, అభినయమే గుర్తుకు వస్తుంది కదూ. ‘యువకుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఎంసీఏ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక వరుస అవకాశాలతో మరోసారి తన హవా కొనసాగిస్తోంది. దర్శక నిర్మాతలు భూమికను ఇష్టపడేందుకు కారణం.. ఆమె చిత్తశుద్ధే. ఇందుకు ‘లడ్డు బాబు’ సినిమా దర్శకుడు రవిబాబు చెప్పిన మాటలే నిదర్శనం.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘లడ్డు బాబు’ సినిమా సమయానికి భూమిక గర్భవతి. అయితే, షూటింగ్ సమయంలో ఆమె ఆ విషయాన్ని దర్శకుడు రవిబాబుకు చెప్పలేదు. షూటింగ్ మొత్తం పూర్తయిన చివరి రోజు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో యూనిట్ మొత్తం షాకయ్యారు. ఆ తర్వాత ఆమె చిత్తశుద్ధికి సంతోషించారు. గర్భంతో ఉన్నా సరే ఆమె తన వృత్తికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా గొప్ప విషయమని రవిబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
2000 సంవత్సరంలో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భూమిక.. మొదటి సినిమాతోనే అందరికీ నచ్చేసింది.
2001లో విడుదలైన ‘ఖుషీ’ సినిమాతో కుర్రకారు మది దోచింది. ‘నడుము’ అంటే భూమికానే గుర్తొచ్చెంతగా ఈ చిత్రంలోని సీన్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘మిస్సమ్మ’ సినిమాతో భిన్నమైన పాత్రలు కూడా చేయగలనని నిరూపించింది.
2007, అక్టోబరు నెలలో భూమిక తన బాయ్‌ఫ్రెండ్, యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2010లో ‘కలెక్టర్ గారి భార్య’ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్లో కనిపించలేదు. 2014లో మళ్లీ ‘లడ్డు బాబు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.
మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత 2017లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి-ఎంసీఏ’ సినిమాతో నానికి వదినగా నటించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘యుటర్న్’, ‘సవ్యసాచి’ చిత్రాల్లో నటించింది.
భూమిక తాజాగా విశ్వక్ సేన్ నటించిన చిత్రంలో హీరోకు తల్లిగా నటించింది. ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది.
భూమిక అసలు పేరు.. రచనా చావ్లా. 1978, ఆగస్టు 21న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించింది. భూమిక తండ్రి విశ్రాంత సైన్యాధికారి. 1997లో ముంబయిలో ప్రకటనల్లో కనిపిస్తూ.. పలు హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్‌లో నటించింది.