Kalyan Jewellers Share Price: స్టాక్‌ మార్కెట్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఛమక్కుమని మెరిసింది. ఈ కౌంటర్‌లో కొన్ని బ్లాక్ డీల్స్‌ జరిగాయి. దీంతో, కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు ఇవాళ (శుక్రవారం, 16 జూన్‌ 2023) NSEలో దాదాపు 13% పెరిగి రూ. 128.60కి చేరుకున్నాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో దాదాపు 52 లక్షల షేర్లు ట్రేడ్ కావడంతో, బలమైన బయింగ్‌ యాక్టివిటీ కనిపించింది.


6 బ్లాక్ డీల్స్‌ ద్వారా 6.41 కోట్ల షేర్లు లేదా 6.2% ఈక్విటీ చేతులు మారినట్లు తెలుస్తోంది.


గురువారం, కంపెనీలో కీలక మేనేజర్ పొజిషన్స్‌కు జరిగిన నియామకాల గురించి ఎక్స్ఛేంజీలకు కళ్యాణ్‌ జ్యువెలర్స్ తెలిపింది. వాటిలో, డిసెంబర్‌ 15 నుంచి అమల్లోకి వచ్చేలా, వచ్చే 3 సంవత్సరాల కాలానికి TS అనంతరామన్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తిరిగి నియమించింది. అతని రీఅప్పాయింట్‌మెంట్‌ను కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదించాల్సి ఉంది.


కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల ప్రైస్‌ యాక్షన్‌
గత ఏడాది జూన్‌లో, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 55 నుంచి కళ్యాణ్‌ జ్యువెలర్స్ స్టాక్ రివర్స్ అయింది. ప్రస్తుతం, NSEలో 52 వారాల గరిష్ట స్థాయి రూ. 134.20కి చేరుకుంది.   


ఈ నెలలో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు దాదాపు 15% లాభపడ్డాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ మూమెంట్‌ రెండు వైపులా లాభదాయకంగా మారింది. ఇటు కొనుగోలుదార్లు, అటు అమ్మకందార్లు ఇద్దరికీ అవకాశాలు సృష్టించింది.


రూ. 12,685.10 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఉన్న ఈ మిడ్‌ క్యాప్ స్టాక్, ప్రస్తుతం, ప్రైస్-టు-బుక్ (PB) వాల్యూ 3.6తో ట్రేడవుతోంది. ఇండస్ట్రీ మీడియన్‌ కంటే ఇది ఎక్కువగా ఉంది, ఇది ప్లస్‌ పాయింట్‌.      


Trendlyne ప్రకారం, ఈ షేర్లు తీవ్ర ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. 1-సంవత్సరం బీటా 1.1 వద్ద ట్రేడ్‌ అయ్యాయి.       


RSI (Relative Strength Index) 62.1 వద్ద ఉంది. క్రమంగా ఓవర్‌బాట్ జోన్‌లోకి చేరుతోందని ఇది సూచిస్తోంది. ఈ నంబర్‌ 70 కంటే పైన ఉంటే స్టాక్ ఓవర్‌బాట్ జోన్‌లోకి ప్రవేశించిందని మార్కెట్‌ భావిస్తుంది. 30 కంటే తక్కువ ఉంటే అది ఓవర్‌సోల్డ్ జోన్‌లో ట్రేడ్ అవుతోందని అర్థం.


5-డేస్‌, 10-రోజులు, 20-డేస్‌, 50-డేస్‌, 100-డేస్‌, 200-రోజుల-డేస్‌ SMA (Simple Moving Average) కంటే ఎగువన ఈ స్టాక్‌ ప్రస్తుతం ట్రేడవుతోంది. ఈ కౌంటర్‌లో బుల్స్‌ బలానికి ఇది సంకేతం.


మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్‌ FDs, ఈ నెల వరకే ఈ గోల్డెన్‌ ఛాన్స్‌ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.