గుప్పెడంత మనసు జూన్ 16 ఎపిసోడ్


వ‌సుధార అడ్రెస్ క‌నిపెట్టిన మ‌హేంద్ర ఆమెను వెతుక్కుంటూ కాలేజీకి వ‌స్తాడు. అక్క‌డ తండ్రిని చూసిన రిషి ఎమోష‌న‌ల్ అవుతాడు. డాడ్ అని పిలుస్తాడు కానీ దోషిగా ముద్ర‌ప‌డిన త‌న‌ను చూసి తండ్రి ఎక్క‌డ బాధ‌ప‌డతాడో అని దాక్కుండిపోతాడు. వ‌సుధార కోసం అక్క‌డి లెక్చ‌ర‌ర్స్‌ను ఎంక్వైరీ  చేస్తాడు మ‌హేంద్ర‌. తాను ఇక్కడున్న విషయం వసుధార చెప్పేసిందా, అందుకే తండ్రి వచ్చాడా అని టెన్షన్ పడతాడు రిషి. 


మరోవైపు రిషి-వసుధార మాటలు వినేసిన పాండ్యన్ లో అనుమానం మొదలవుతుంది. ఇద్దరి మధ్యా ఏదో ఉంది అదేంటో తెలిస్తే ఇద్దరిపై రివెంజ్ తీర్చుకునే అవకాశం వస్తుందనుకుంటాడు. ఇద్దరి మధ్యా ఉన్న మిస్టరీనే తనకు ఆధారమని, కేడీ బ్యాచ్ లో పెట్టుకుంటే ఏమవుతుందో వసు, రిషికి చూపిస్తానని చాలెంజ్ చేస్తాడు. 


Also Read: ఇంకోసారి రిపీటైతే బావోదంటూ వసుకి వార్నింగ్, రిషి ప్రేమకథ మొత్తం వినేసిన పాండ్యన్!


మహేంద్ర రావడాన్ని చూసిన రిషి..ముందే వెళ్లి వసుధారని కలుస్తాడు. రిషిలో కంగారు చూసి ఏమైందని అడుగుతుంది. కానీ ఈగోమాస్టర్ వసుపై ఫైర్ అవుతాడు. 
రిషి: చేసిందంతా చేసి ఏం తెలియ‌న‌ట్లుగా నాట‌కాలు ఆడుతున్నావా . నేను ఇక్క‌డ ఉన్న విష‌యం మా డాడ్ కి ఎలా తేలిసింది
వసు: నేను చెప్ప‌లేద‌ు సార్
రిషి: రిషి మాత్రం ఆమె మాటలు నమ్మడు, అబ‌ద్దాలు ఆడ‌టం, మోసం చేయ‌డం నీకేం కొత్త కాదు క‌దా. ఫేక్ ప్రామిస్‌లు చేయ‌డం, ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌క‌పోవ‌డం నీకు అల‌వాటే క‌దా. నువ్వు చెప్ప‌క‌పోతే మా డాడ్ కి  మ‌నం ఇక్క‌డున్న విష‌యం ఎలా తెలుస్తుంది. నా అడ్ర‌స్ ఎవ‌రికి చెప్పొద్ద‌ని ఇదివర‌కే నీతో అన్నాను. ఒక‌వేళ నా గురించి నువ్వే నాన్న‌కు చెప్పావ‌ని తెలిసినా, నీ వ‌ల్ల ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చార‌ని తెలిసినా జీవితంలో నీ మొహం చూడ‌ను అని వార్నింగ్ ఇస్తాడు
వసు:  అల్రెడీ ఒక‌సారి త‌ప్పు చేసి శిక్ష అనుభ‌విస్తున్నా. మ‌ళ్లీ త‌ప్పు చేసే ధైర్యం చేయ‌న‌ంటూ ఎమోష‌న్ అవుతుంది.


ఇంత‌లోనే మ‌హేంద్ర అక్క‌డ‌కు రావడం చూసి రిషి ఓ బోర్డు వెనుక దాక్కుంటాడు
మ‌హేంద్ర ద‌గ్గ‌ర‌కు రాగానే బాగున్నారా సార్ అని అత‌డిని అడుగుతుంది వ‌సుధార‌. బాధ‌లో ఉన్న‌వాడిని బాగున్నారా అని అడ‌గ‌టం మూర్ఖ‌త్వం అంటూ క్లాస్ వేస్తాడు. రిషి గురించి తెలుసుకోవ‌డానికే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని వ‌సుధార‌తో అంటాడు. తనకు తెలియదని అబద్ధం చెబుతుంది వసుధార. కానీ వసుధార నిజం దాచిపెడుతోందని గమనించేసిన మహేంద్ర.. మాట‌ల్లో బెరుకు చూస్తేనే అర్థ‌మ‌వుతుంది నువ్వు అబ‌ద్దం చెబుతున్నావ‌ని అంటాడు. రిషి ఎక్క‌డున్నాడ‌ని క‌న్నీళ్ల‌తో వ‌సుధార‌కు రిక్వెస్ట్ చేస్తాడు మ‌హేంద్ర‌. కానీ మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెబుతానని స్ట్రాంగ్ గా అంటుంది. రిషి గురించి తెలియ‌క‌పోతే నాకు ఫోన్ ఎందుకు చేశావు? నేను తిరిగి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయ‌లేద‌ని వ‌సుధార‌పై మ‌హేంద్ర సీరియ‌స్ అవుతాడు


మహేంద్ర: ఇలా  అబ‌ద్దాలు ఆడే... నువ్వు, జ‌గ‌తి క‌లిసి రిషిని దోషిని చేశార‌ని, అబ‌ద్దాలు ఆడే మోస‌గాడిని చేశార‌ని ఫైర్ అవుతాడు. రిషి క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న డీబీఎస్‌టీ సామ్రాజ్యానికి దూరం చేశారు. చివ‌ర‌కు ఈ క‌న్న తండ్రికి దూరం చేశార‌ని మ‌హేంద్ర ఎమోష‌న్ అవుతాడు. స‌మాజం అంగీక‌రించ‌క‌పోయినా నీ మ‌న‌సు అర్థం చేసుకొని నిన్ను భార్య‌గా స్వీక‌రించాడు అదేనా రిషి చేసినా పాపం. న‌లుగురు వేలేత్తి చూపినా నిన్ను ఇంట్లోను, గుండెల్లో పెట్టుకొని చూశాడు. అదేనా రిషి చేసిన పాపం. ఎందుకు రిషికి న‌మ్మ‌క‌ద్రోహం చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు 


Also Read: జూన్ 16 రాశిఫలాలు, అనుకున్న పనులు పూర్తవకపోవడంతో ఈ రాశివారిని నిరాశ ఆవహిస్తుంది


వసుధార మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంది


మహేంద్ర: అక్క‌డ జ‌గ‌తి చెప్ప‌క‌, నువ్వు చెప్ప‌క నేను ఏమ‌నుకోవాలి. ఎవ‌రి స్వార్థం కోసం రిషి బ‌లైపోయాడో చెప్ప‌ు.  రిషి గురించి ఏ చిన్న స‌మాచారం తెలిసిన ఈ తండ్రి వాడి కోసం ఎదురుచూస్తున్నాడ‌ని చెప్పు అని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు మ‌హేంద్ర‌. రిషి ఇక్క‌డే ఎక్క‌డో ఉన్నాడ‌ని నా మ‌న‌సు చెబుతోంది. రిషిని మోసం చేసిన‌ట్లే న‌న్ను మోసం చేయ‌ద్ద‌ని వేడుకుంటాడు. రిషి క‌నిపిస్తే చెప్ప‌మ‌ని ఆమెకు దండం పెడ‌తాడు. అక్క‌డే ఉన్న రిషి తండ్రి బాధ చూసి ఎమోష‌న్ అవుతాడు. మాట‌ల రాక అక్క‌డే కుప్ప‌కూలిపోతాడు.


మ‌హేంద్ర బాధ‌గా ఇంట్లో అడుగుపెట్ట‌డం చూసి జ‌గ‌తి కంగారు ప‌డుతుంది. వ‌సుధార‌ను క‌లిశావా? రిషి గురించి ఏమైనా చెప్పిందా? అని వరుస ప్రశ్నలు వేస్తుంది. నా  క‌ళ్ల‌ల్లో నీళ్లు గ‌మ‌నించి కూడా ఇన్ని ప్ర‌శ్న‌లు ఎవ‌రైనా అడుగుతారా అని అక్క‌డే ఉన్న ధ‌ర‌ణితో అంటాడు మ‌హేంద్ర‌. క‌న్న కొడుకును చూస్తాన‌నే ఎన్నో ఉహ‌ల‌తో ఇక్క‌డి నుంచి బ‌య‌లుదేరాన‌ని, కానీ అన్నీ గాలిలో క‌లిసిపోయాన‌ని అంటాడు. రిషి గురించి ఏం తెలియ‌ద‌ని వ‌సుధార చెప్పింద‌ని స‌మాధాన‌మిస్తాడు. దీనికి అంత‌టికి కార‌ణం జ‌గ‌తినే, నా కొడుకును నాకు దూరం చేసి పాపం మూట‌గ‌ట్టుకుంద‌ని అంటాడు. ఒక తండ్రి గుండెకోత‌కు కార‌ణ‌మైంద‌ని జ‌గ‌తిని అవ‌మానిస్తాడు. రిషి కోసం వెతికి అలిసిపోయాన‌ని ఎమోష‌న్ అవుతాడు.


రిషి స్ట్రాంగ్ నిర్ణయం
వ‌సుధార నీ పేరు వింటేనే నా ఊపిరి ఆగిపోయినంత ప‌నైపోతుంది. నీ మ‌న‌సులో నా మీద ఉన్న ప్రేమ చెరిగిపోలేద‌ని, ఇప్ప‌టికీ రిషి సార్‌లా చూసే నీ చూపు మారాలి. అలా జ‌ర‌గాలంటే తాను స‌రికొత్త‌గా క‌నిపించాల‌ని రిషి అనుకుంటాడు. వ‌సుధార మ‌న‌సులో ఉన్న త‌న స్థానాన్ని తానే చెరిపివేయాల‌ని  డిసైడ్ అవుతాడు. తాను ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలంటే గ‌తం త‌న‌ను వెంటాడ‌కూడ‌ద‌ని , వ‌సుధారతో పాటు ఆమె చూపు త‌న‌ను డిస్ట్ర‌బ్ చేయ‌కూడ‌ద‌ని, వ‌సుధార క‌ళ్ల‌లో త‌న‌పై ఉన్న ప్రేమ క‌నిపించ‌కూడ‌ద‌ని ఫిక్స్ అవుతావు. పాత రిషీంద్ర భూషణ్  అధ్యాయం ముగిసిపోయేలా చేయాలని నిర్ణయించుకుంటాడు.