తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా వందల కొద్ది సినిమాలు చేసి అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణిక,జానపద, సాంఘిక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. జయ, పరాజయాలతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తారు. యంగ్ హీరోలతో పోటీ మరీ సూపర్ డూపర్ సినిమాలు చేస్తుంటారు. సినిమాలు ఒక్కటేకాదు, రాజకీయాలు, సేవా కార్యక్రమాల్లోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఆహా లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్ మీద కూడా బాలయ్య సత్తా చాటారు. ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్ బీ కే’ షోతో ఎంతగానో అలరించారు.   


ట్రావెల్ ఫ్రెండ్ కు బాలయ్య సర్ ప్రైజ్


బాలయ్య ఒక్కోసారి కోపం ప్రదర్శించినా, మంచి మనసున్న వ్యక్తి అని పలుమార్లు నిరూపించుకున్నారు. తనకు నచ్చిన వారితో ఎంతో ప్రేమగా ఉంటారు. పేద, ధనిక అనే తేడా చూడరు. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన సందర్భాలున్నాయి.  తాజాగా మరోసారి బాలయ్య తన అభిమాని పట్ల, తాను ఇష్టపడే వ్యక్తి పట్ల ప్రేమను చాటుకున్నారు. ఏకంగా వారి ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నా, తన ఫ్రెండ్ కోసం వాటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చారు.


గృహప్రవేశ వేడుకకు హాజరైన నటసింహం


హరీష్, అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణంలో బాలయ్యకు పరిచయం అయ్యారు. హరీష్ మాటతీరు బాలయ్యకు బాగా నచ్చింది. పరిచయం అయ్యింది ఫ్లైట్ లోనే ఆ తర్వాత కూడా తరచుగా వారిద్దరు ఫోన్ లో మాట్లాడుకునే వారు. హరీష్ చిన్నవాడే అయినా, తన ఆలోచనలకు బాలయ్య బాగా కనెక్ట్ అయ్యారు. రీసెంట్ గా బాలయ్యతో ఫోన్ లో మాట్లాడిన హరీష్, త్వరలో తమ గృహ ప్రవేశం ఉందని చెప్పారు. ఆ వేడుకకు తప్పకుండా రావాలని బాలయ్యను ఆహ్వానించాడు. సరే అని చెప్పారు బాలయ్య. అన్నట్లుగానే హరీష్ వాళ్ల గృహప్రవేశం కార్యక్రమానికి బాలయ్య వచ్చారు. బాలయ్య రాకతో హరీష్ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపోయారు. అందరూ ఆయనను చూసేందుకు వచ్చారు. ఆయనతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడే గడిపిన బాలయ్య మళ్లీ కలుద్దాం అంటూ అక్కడి నుంచి బయల్దేరారు. తనకు నచ్చిన మనుషుల కోసం బాలయ్య ఏదైనా చేస్తారు. ఎంత వరకైనా వెళ్తారుని అని ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. తాజాగా హరీష్  గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మంచి మనసు పట్ల అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.






ఇక ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్’ కేసరి అనే పేరు ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. మాస్ కే బాస్ లా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  


Read Also: 18 ఏళ్ల ‘నో కిస్’ రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా - ఈ నిర్ణయం అతడి కోసమేనట!