Bank Holidays Diwali 2023: ఆదివారం (12 నవంబర్‌ 2023) రోజున, దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీపావళి అంటే ఒక్క రోజు వేడుక కాదు, ఐదు రోజుల పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2 రోజులు, 3 రోజులు, 5 రోజుల పాటు పండుగ జరుపుకుంటారు. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ఆయా రోజుల్లో బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. 


దీపావళి వేడుకల పరంపరలో గోవర్దన్ పూజ, భాయ్ దూజ్ వేడుకలు మిగిలే ఉన్నాయి. ఛోటీ దీపావళి, బడీ దీపావళి రెండో శనివారం, ఆదివారం రోజున వచ్చాయి. సాధారణంగా, ప్రతి రెండో శనివారం, ఆదివారం బ్యాంక్‌లకు సెలవు కాబట్టి.. ఛోటీ దీపావళి, బడీ దీపావళి ఆ సాధారణ సెలవుల్లో కలిసి పోయాయి. దీపావళి వేడుకల పరంపరలో భాగంగా ఈ రోజు (సోమవారం, 13 నవంబర్ 2023), రేపు (మంగళవారం, 14 నవంబర్‌ 2023) దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. భాయ్ దూజ్ పండుగను 15 నవంబర్ 2023న (బుధవారం) జరుపుకుంటారు. 


సోమవారం ఏయే ప్రాంతాల్లో బ్యాంక్‌లకు సెలవు?
ఈ రోజు (సోమవారం) దేశంలో బ్యాంకులు మూతబడిన రాష్ట్రాల్లో త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఈ రోజు గోవర్దన్ పూజ లేదా లక్ష్మి పూజ చేస్తారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. కొన్ని రాష్ట్రాల్లో, 11, 12 తేదీల్లో రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం సెలవు వల్ల.. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి.


మంగళవారం ఏయే ప్రాంతాల్లో బ్యాంక్‌లు పని చేయవు?
కొన్ని రాష్ట్రాల్లో, మంగళవారం రోజు కూడా బ్యాంక్‌లకు సెలవు ఇచ్చారు. బలి ప్రతిపద (దీపావళి), విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం రోజు లేదా లక్ష్మి పూజను మంగళవారం నిర్వహిస్తారు. దీపావళి పండుగ సిరీస్‌లోనే ఈ సెలవు కూడా వచ్చింది. కాబట్టి... మంగళవారం నవంబర్ 14న, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలో బ్యాంకులు పని చేయవు.


సిక్కింలో వరుసగా 5 రోజులు బ్యాంక్‌లకు సెలవులు
ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో భాయ్ దూజ్ పండుగను బుధవారం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో.. నవంబర్ 11న రెండో శనివారం నుంచి, నవంబర్ 15న బుధవారం వరకు బ్యాంకులకు వరుసగా 5 రోజులు హాలిడేస్‌ వచ్చాయి.


మీకు ఏదైనా పని ఉండి బ్యాంక్‌కు వెళ్లాల్సి వస్తే, ముందుగా మీ నగరంలో బ్యాంక్‌లు ఆ రోజు పని చేస్తున్నాయో, లేదో తెలుసుకోవడం బెటర్‌. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రతి నెల బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ఆ నెల ప్రారంభం కాకముందే రిలీజ్‌ చేస్తుంది. ఆర్‌బీఐ హాలిడేస్‌ క్యాలెండర్ ప్రకారం... మొత్తం నవంబర్‌ నెలలో, దేశంలోని బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. వీటిలో... పండుగలు, జాతీయ ప్రత్యేక సందర్భాలు, ఆదివారం, రెండు & నాలుగు శనివారం సెలవులు కూడా కలిసి ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను బట్టి బ్యాంకు సెలవుల జాబితా మారుతూ ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: దీపావళి తర్వాత మందగించిన మార్కెట్ - లాస్‌లో సెన్సెక్స్‌, 19,500 దిగువన నిఫ్టీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial