Stock Market Today, 13 November 2023: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలను పెట్టుబడిదార్లు పట్టించుకోకపోవడంతో ఆదివారం ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో బలం కనిపించింది. ప్రస్తుత బుల్లిష్ మొమెంటం సమీప భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.
లాభపడిన అమెరికన్ స్టాక్స్
వాల్ స్ట్రీట్ ప్రధాన సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రెజరీ ఈల్డ్స్ శాంతించడంతో.. టెక్, గ్రోత్ స్టాక్స్ ద్వారా హెవీవెయిట్ ఊపందుకుంది. పెట్టుబడిదార్లు యూఎస్ ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక డేటా రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
పురోగమనంలో ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్‌లో శుక్రవారం జరిగిన టెక్-ఆధారిత ర్యాలీతో, ఈ రోజు ఆసియా షేర్లు బాగా పెరిగాయి. మంగళవారం రానున్న కీలకమైన US ఇన్‌ఫ్లేషన్ డేటా కోసం పెట్టుబడిదార్లు వెయిట్ చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.07 శాతం గ్రీన్ కలర్‌లో 19,555 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
సన్ టీవీ: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సన్ టీవీ నికర లాభం 14% (YoY) పెరిగి రూ.456 కోట్లకు చేరుకుంది.
ONGC: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఏకీకృత నికర లాభం 65% జంప్‌తో రూ.13,734 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం మాత్రం 13% తగ్గి రూ.1.47 లక్షల కోట్లకు పరిమితమైంది.
ఐషర్ మోటార్స్: సెప్టెంబర్ క్వార్టర్‌లో ఐషర్ మోటార్స్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 55% పెరిగి రూ.1,016 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 17% వృద్ధితో రూ.4,115 కోట్లకు చేరుకుంది.
కోల్ ఇండియా: సెకండ్ క్వార్టర్‌లో కోల్ ఇండియా 12% వృద్ధితో రూ.6,800 కోట్లు లాభపడింది. కార్యకలాపాల ద్వారా 10% వృద్ధితో రూ.32,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
BSE: ఎక్స్ఛేంజ్ BSE, Q2 FY24లో, నికర లాభం భారీగా 300% పెరిగి చేసి రూ. 118 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 29 కోట్లు లాభాన్ని ఈ ఎక్సేంజ్ ప్రకటించింది.
ఫ్యూచర్ రిటైల్: రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఈ కంపెనీ లిక్విడేషన్‌ను ప్రారంభించేందుకు NCLTకి దరఖాస్తును దాఖలు చేశారు.
హిందుస్థాన్ కాపర్: సెప్టెంబర్ క్వార్టర్‌లో హిందుస్థాన్ కాపర్ రూ.60.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ.381 కోట్ల ఆదాయం సంపాదించింది.
టాటా కెమికల్స్: Q2లో టాటా కెమికల్స్ నికర లాభం 27% తగ్గి రూ.495 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ఆదాయం కూడా 6% క్షీణించి రూ.3,998 కోట్లకు దిగి వచ్చింది.
సెయిల్: జూలై-సెప్టెంబర్ కాలంలో సెయిల్ రూ.1,305 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 29,712 కోట్లుగా ఉంది.
జూబిలెంట్ ఫార్మోవా: టెక్నీషియం సల్ఫర్ కొల్లాయిడ్ ఇంజెక్షన్ తయారీ కోసం ఈ కంపెనీ పెట్టుకున్న న్యూ డ్రగ్ అప్లికేషన్‌కు USFDA ఆమోదం లభించింది.
ఫోర్టిస్ హెల్త్‌కేర్: సెప్టెంబర్ క్వార్టర్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 16% పెరిగి రూ. 184 కోట్లకు చేరుకోగా, ఆదాయం 10% పెరిగి రూ.1,770 కోట్లకు చేరుకుంది.
LIC: రెండో త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 50% తగ్గి రూ.7,925 కోట్లకు పరిమితమైంది. నికర ప్రీమియం ఆదాయం కూడా 19% క్షీణించి రూ.1.07 లక్షల కోట్లుగా నమోదైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టీవీ, ఏసీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా పెద్ద గుడ్‌న్యూస్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial