Share Market Opening on 13 November 2023: ధన్‌తేరస్ సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత సూచీలు ఈ రోజు (సోమవారం) బలహీనంగా ప్రారంభమయ్యాయి, నిఫ్టీ 19500 దిగువకు పడిపోయింది. నేడు ఫార్మా షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి, వాటి నుంచి మార్కెట్‌కు కొంత మద్దతు లభిస్తోంది.
నిన్న (ఆదివారం) సాయంత్రం, దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా, పెట్టుబడిదార్లు మార్కెట్‌లో భారీగా షాపింగ్ చేశారు. దీంతో, BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ మంచి బౌన్స్‌తో క్లోజ్ అయ్యాయి. గంట పాటు జరిగిన స్పెషల్ ట్రేడింగ్‌లో, బాంబే స్టాక్ ఎక్సేంజ్ 354 పాయింట్లు లాభపడి 65,259 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 100 పాయింట్లు ఎగబాకి 19,525 దగ్గర స్థిరపడ్డాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
ఈ రోజు సెషన్‌లో... సెన్సెక్స్ 101.14 పాయింట్లు లేదా 0.15 శాతం పెరుగుదలతో 65,158.31 స్థాయి వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 38.80 పాయింట్లు లేదా 0.20 శాతం పెరుగుదలతో 19,486.75 వద్ద స్టార్ట్ అయింది. బిజినెస్ ఓపెనింగ్ టైమ్‌లో బ్యాంక్ నిఫ్టీలోనూ క్షీణత కనిపించింది, చాలా బ్యాంక్ స్టాక్స్ రెడ్ మార్క్‌తో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 43,815 స్థాయి వద్ద, 0.40 శాతం బలహీనతను చూపింది.
నిఫ్టీ షేర్ల చిత్రం
మార్కెట్ ప్రారంభంలో... నిఫ్టీ 50 ప్యాక్‌లోని 11 స్టాక్స్ మాత్రమే పెరుగుదలను చూశాయి, మిగిలిన 39 పడిపోతున్న పరిస్థితిలో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. ఐషర్ మోటార్స్ 2.17 శాతం, కోల్ ఇండియా 1.51 శాతం, ఎన్‌టీపీసీ 1.21 శాతం, హిందాల్కో 0.91 శాతం, బీపీసీఎల్ 0.42 శాతం చొప్పున లాభపడ్డాయి.
సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
ఓపెనింగ్ టైమ్‌లో... సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 5 స్టాక్స్ మాత్రమే గ్రీన్ బుల్లిష్ మార్క్‌లో ట్రేడవగా మిగిలిన 25 స్టాక్స్ క్షీణతను చూశాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. ఎన్‌టీపీసీ 1.53 శాతం, పవర్ గ్రిడ్ 0.59 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.49 శాతం, సన్ ఫార్మా 0.17 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.01 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ 1.14 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.78 శాతం, హెచ్‌యూఎల్ 0.68 శాతం, ఇన్ఫోసిస్ 0.71 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.66 శాతం. నెస్లే 0.65 శాతం పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలోనూ బలహీనత ఉంది.
ఉదయం 10 గంటల సమయానికి, సెన్సెక్స్ 230.42 పాయింట్లు లేదా 0.35% పడిపోయి 65,029 వద్ద; నిఫ్టీ 60.40 పాయింట్లు లేదా 0.31% నష్టంతో 19,465 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
లాభపడిన అమెరికన్ స్టాక్స్
వాల్ స్ట్రీట్ ప్రధాన సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రెజరీ ఈల్డ్స్ శాంతించడంతో.. టెక్, గ్రోత్ స్టాక్స్ ద్వారా హెవీవెయిట్ ఊపందుకుంది. పెట్టుబడిదార్లు యూఎస్ ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక డేటా రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
పురోగమనంలో ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్‌లో శుక్రవారం జరిగిన టెక్-ఆధారిత ర్యాలీతో, ఈ రోజు ఓపెనింగ్ టైమ్‌లో ఆసియా మార్కెట్లు బాగా పెరిగాయి. మంగళవారం రానున్న కీలకమైన US ఇన్‌ఫ్లేషన్ డేటా కోసం పెట్టుబడిదార్లు వెయిట్ చేస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial