Job Vacancies In Alluri Sitharama Raju District: పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 22


➥ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
జీతం: రూ.44,023.


➥ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.27,804.


➥ ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.27,804.


➥ లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ).
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.27,804.


➥ కౌన్సెలర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.18,536.


➥ సోషల్‌ వర్కర్‌: 02
అర్హత: సంబంధిత విభాగంలో బీఏ డిగ్రీ. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: తగిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: రూ.18,536.


➥ అకౌంటెంట్: 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కామర్స్/మ్యాథమెటిక్స్). కంప్యూటర్ నాలెడ్జ్, ట్యాలీ తెలిసి ఉండాలి.
అనుభవం: ఏడాది అనుభవం ఉండాలి.
జీతం: రూ.18,536.


➥ డేటా అనలిస్ట్: 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కంప్యూటర్స్(బీసీఏ)). కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: రూ.18,536.


➥ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కంప్యూటర్స్‌లో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
అనుభవం: అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: రూ.13,240.


➥ అవుట్‌రీచ్ వర్కర్స్: 01
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
అనుభవం: అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
జీతం: రూ.10,592.


➥ మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు): 01
అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.23,170.


➥ సోషల్‌ వర్కర్‌ కమ్- ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌(మహిళలు): 01
అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.18,536.


➥ నర్సు(మహిళలు): 01
అర్హత: ఏఎన్‌ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.11,916.


➥ డాక్టర్ (పార్ట్ టైమ్): 01
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీతోపాటు పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ ఉండాలి.
జీతం: రూ.9,930.


➥ అయా(మహిళలు): 06
అర్హత: నవజాత శిశువులు, ఆరేళ్లలోపు చిన్నారులను చూసుకునే సామర్థ్యం ఉండాలి.
జీతం: రూ.7,944


➥ చౌకీదార్(మహిళలు): 01
అర్హత: వివాద రహితురాలై ఉండాలి. గుట్కా, మద్యం లాంటి అలవాట్లు ఉండకూడదు.
జీతం: రూ.7,944


వయోపరిమితి: 31.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.


దరఖాస్తుకు చివరితేది: 16.11.2023.


దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
The District Women & Child Welfare & Empowerment Officer, 
Near Talasingi, Beside Balasadan, Paderu,
A.S.R.district - 531024. 


Notification & Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...