Ashneer Grover Resigns: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్​ డైరెక్టర్​ అష్నీర్ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌కు కంపెనీ ఇటీవల గట్టి షాకిచ్చింది. ఆమెను ఇటీవల కంపెనీ నుంచి తొలగించారు. కొద్ది రోజుల్లోనే  అష్నీర్ గ్రోవర్ ఎండీ పదవి నుంచి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను సంస్థకు పంపించారు.







కొన్ని నెలల కిందట ఆరోపణలు.. 
భారత్‌పేలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిపై అసభ్య పదజాలాన్ని వాడారని అష్నీర్ గ్రోవర్ దంపతులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిన్ టెక్ భారత్‌పే కో ఫౌండర్ మూడు నెలలు లీవ్ తీసుకున్నారు. ఆయన భార్య మాధురి గ్రోవర్‌ను కంపెనీ సెలవులపై పంపించింది. గత నెలలో మాధురి గ్రోవర్‌ను కంపెనీ నుంచి భారత్‌పే తప్పించింది. కంపెనీ సీకెట్ర్ విషయాలను వినియోగించి మాధురి తండ్రి, సోదరుడు ఫేక్ ఇన్‌వాయిస్‌లు క్రియేట్ చేసినట్లు గుర్తించడంతో ఆమెను సంస్థ నుంచి తొలగించారు. తాజాగా ఆమె భర్త, భారత్‌పే కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. తన రాజీనామా లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు.


సంస్థకు ఆష్నీర్ గ్రోవర్ లేఖలో ఏం రాశారంటే.. (Ashneer Grover’s resignation letter)
‘నేను స్థాపకుడిగా ఉన్న కంపెనీ నుంచి ఈరోజు బలవంతంగా విడ్కోలు ఇవ్వవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఫిన్‌టెక్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని తల పైకెత్తి గర్వంగా చెబుతున్నాను. 2022లో ప్రారంభం నుండి నా పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లుతోంది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా  నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. అందుకు సాక్ష్యాలు క్రియేట్ చేసి నన్ను టార్గెట్ చేశారు.


భారతీయులు స్టార్టప్ ప్రారంభించి సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని విజయం సాధిస్తున్నారు. ఎంతో మందికి సంస్థ ప్రేరణగా నిలిచింది. కానీ నేడు నా సొంత కంపెనీ పెట్టబడిదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. వారితో ఒంటరిగా పోరాటం చేస్తున్నాను.  ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నది నేను కాదు. భారత్‌పే చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. నాకు తెలిసిన వారు, నాతో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తులు నన్ను నమ్ముతారు.


బెస్ట్ ఎడ్యుకేషన్..
అత్యుత్తమ విద్యాసంస్థలైన ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేట్‌ చేశాను. నేను మధ్యతరగతి తల్లిదండ్రుల కడుపున పుట్టాను.  వారు నాలో కృషి, చిత్తశుద్ధి, నిజాయితీని నింపారు. రెండు యునికార్న్ వ్యాపారాలను నిర్మించడంలో కీలకపాత్ర పోషించా. Grofers నుంచి   BharatPe వరకు ఎంతగానో శ్రమించాను. ఎందరికో ఉగ్యోగావకాశాలు కల్పించారు. నా ఎదుగుదల నాకు మాత్రమే పరిమితం కాకుండా వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా నాతో అనుబంధం ఉన్న వ్యక్తుల కోసం సహాయం చేశా. దేశంలో స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి నేను సంపాదించిన దబ్బును ఇన్వెస్ట్ చేశా. 


నేను భారత్‌పేని నా బిడ్డలా పెంచి డెవలప్ చేశాను. నా సహ వ్యవస్థాపకుడు, సూపర్ టీంతో దీన్ని నిర్మించాను. చాలా సార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వెనకడుకు వేయలేదు. BharatPe UPI స్పేస్‌లో  ప్రవేశించింది మరియు PayTM, PhonePe, GooglePay వంటి సంస్థలతో పోటీ పడింది.  ‘0% MDR’తో చెల్లింపులకు అంతరాయం కలిగించకూడా చేశాం. చెల్లింపులపై రుణాలు, పోస్ట్ పే, సౌకర్యాలు తీసుకొచ్చాం. నా కృషితో కంపెనీ ఏటా రూ. 100,000 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపింది.  రూ. 4,000 కోట్ల కంటే ఎక్కువ రుణాలు ఇచ్చే 1 కోటి దుకాణదారుల నెట్‌వర్క్‌ను సృష్టించగలిగాం. లక్షలాది వ్యాపారులకు భారత్‌పే లోన్స్ ఎంతో సహాయం చేశాయి.


వాస్తవం ఏమిటంటే, పెట్టుబడిదారులుగా మీరు నిజాలను నేడు గుర్తించడం లేదు. అసలైన వ్యాపారం ఎలా ఉంటుందో మీరు మర్చిపోయారు. నాపై, నా కుటుంబపై వరుసగా వస్తున్న ఆరోపణల్ని ఇక భరించలేను. సహవ్యవస్థాపకుడిగా కంపెనీని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతగానో శ్రమించా. నాపై వ్యతిరేకంగా మీకు ఒక్క ఆధారం కూడా లభించలేదని నాకు తెలుసు. కంపెనీని నడిపించే అతిపెద్ద సవాల్‌ను మీకు వదిలి వెళ్తున్నారు. భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది. అయితే కంపెనీలో అతిపెద్ద వాటాదారుడిగా కొనసాగుతానని’ అష్నీర్ గ్రోవర్ పలు విషయాలు తన లేఖలో ప్రస్తావించారు.


Also Read: Amul Milk Price Hike: వినియోగదారుడికి షాక్ ఇచ్చిన అమూల్, దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన పాల ధరలు


Also Read: Special Flights : ప్రత్యేక విమానంలో టూర్‌కెళ్లాలా ? చాలా ఈజీ , ఇలా చేస్తే చాలు