చాలా మందికి విమానం ఎక్కడమే అద్బుతం . కానీ రెగ్యలర్‌గా విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రం క్యాబ్ మాట్లాడుకున్నట్లుగా ప్రత్యేక విమానం మాట్లాడుకుని వెళ్లడం ప్రెస్టీజ్. ఇప్పుడు ఇలా ప్రత్యేక విమానాలు మాట్లాడుకుని టూర్లలో వెళ్లే వారి హైదరాబాదీయుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ ప్రత్యేక విమానాల సర్వీసులు ( Special Flights ) శంషాబాద్ నుంచి కాదు బేగం పేట ( begumpet ) నుంచే ఉంటున్నాయి. దీంతో కాస్త "డబ్బు చేసిన" వారంతా ఎక్కడికైనా గ్రూపుగా వెళ్లాలంటే ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు.
మార్చి 31లోపు Home Loan పొందండి - లేదంటే రూ.3.5 లక్షల పన్ను మినహాయింపు కోల్పోతారు
హైదరాబాద్ ( Hyderabad ) నగరం కేంద్రంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, సినిమా తారాలు ( Film Stars ) ఇటీవల ఛార్టర్ ఫ్లయిట్ సేవలను బాగా ఉపయోగించుకుంటున్నారు. నగరం మధ్యలో బేగంపేట ఉండటంతో ఇక్కడి నుంచి సులువుగా ప్రయాణం చేయడం వీలవుతోంది. హైదరాబాద్‌లో ఛార్టర్ ఫ్లైయిట్స్‌కి పెరిగిన డిమాండ్ చూసి పెద్ద పెద్ద కంపెనీలు తమ విమానాలను తెచ్చి బేగంపేటలో పెడుతున్నాయి.
బంగారం, ప్లాటినమ్‌పై పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇదే మంచి ఛాన్స్
ప్రత్యేక విమానం చార్జీ ( Special Flight Charge ) గంటకు రూ. 1.60 లక్షల నంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. విమానం స్థాయిని బట్టి ధర ఉంటుంది. ఇంత ధర పెట్టి కూడా రోజుకు సగటున 8 బుకింగ్స్ జరుగుతున్నాయి. కరోనా ( Corona ) ముందుకు పరిస్థితితో పోల్చితే హైదరాబాద్‌లో ఛార్టర్ ఫ్లయిట్స్ బిజినెస్ ( Business ) ఏకంగా 200 శాతం పెరిగిందని ఏవియేషన్ వర్గాలుచెబుతున్నాయి. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో కూడా ఇంత డిమాండ్ లేదని చెబుతున్నారు. దేశంలో ఛార్టర్ ఫ్లయిట్స్ బిజినెస్‌లో 30 శాతం హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఛార్టెడ్ విమానాలకు ( Charted Flihts ) డిమాండ్ పెరగడంతో బేగంపేట ఎయిర్‌పోర్టులో దాదాపు 14 మినీ విమానాలు నిలిచి ఉంటున్నాయి. ఇందులో 6 సీట్ల నుంచి 13 సీట్ల కెపాసిటీ ఉన్న విమానాలు ఉన్నాయి. నిజానికి హైదరాబాద్‌కు చెందిన పలువురు సినీ, వ్యాపార ప్రముఖులకు సొంత విమానాలు ( Own Flights ) ఉన్నాయి. వీరు తాము ఎక్కడకు వెళ్లాలన్నా విమానాల్లోనే వెళ్తారు. మిగతా సమయంలో ఏజెన్సీల ద్వారా అద్దెకు ఇస్తారు.