Home Loan Tax Benefit: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందుబాటు ధరలో (Affordable Housing) ఇంటిని కొనుగోలు చేసేందుకు గృహరుణం (Home Loan) తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే 2022, మార్చి 31లోపే ఆ రుణం ఆమోదం పొందేలా చూసుకోండి. ఎందుకంటే ఆదాయపన్ను సెక్షన్‌ 80EEA  (Income Tax) కింద ఇంటిరుణం వడ్డీపై అదనంగా రూ.2 లక్షలు పన్ను మినహాయింపు పొందొచ్చు. 2022, ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం ఈ మినహాయింపును కొనసాగించడం లేదు.


సెక్షన్‌ 80EEA ప్రకారం ఒక వ్యక్తి ఇంటి రుణంపై రూ.1.5 లక్షలకు అదనంగా సెక్షన్‌ 24 కింద మరో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అంటే మొత్తంగా ఇంటి రుణంపై ఏడాదికి రూ.3.5 లక్షల వరకు మినహాయింపు వర్తిస్తుంది. అదీ ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు. పూర్తి రుణం తీరే వరకు మినహాయింపును పొందొచ్చు. దీనివల్ల రుణ గ్రహీతపై మరింత పన్ను భారం తగ్గుతుంది. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


* ఈ ఇంటి రుణాన్ని 2019, ఏప్రిల్‌ 1 నుంచి 2022, మార్చి 31లోపే మీ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఆమోదించి ఉండాలి.
* ఈ ఇంటి స్టాంప్‌ డ్యూటీ విలువ రూ.45 లక్షలను మించకూడదు.
* ఆ రుణం ఆమోదించే సమయానికి ఆ వ్యక్తికి ఎలాంటి రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ ఉండకూడదు.


ఆదాయపన్ను చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తులు ఇంటి రుణం ఈఎంఐలపై (Home Loan EMI) రెండు టాక్స్‌ బ్రేకులు (Tax break) పొందొచ్చు. ఎందుకంటే ఇంటి రుణం ఈఎంఐలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో అసలు (Principal Repayment), రెండోది వడ్డీ (Interest). సెక్షన్‌ 80C ప్రకారం పన్ను చెల్లింపుదారుడు అసలుపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు (Tax deduction) పొందొచ్చు. అంతేకాకుండా చెల్లిస్తున్న వడ్డీపై సెక్షన్‌ 24 కింద రూ.2లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అంటే మొత్తంగా రూ.3.50 లక్షల వరకు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.


Also Read: గుడ్‌న్యూస్‌ రాబోతోందా! ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం!


Also Read: ప్రతిరోజూ రూ.100 SIP - సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకం