వింటేజ్ బైక్ బ్రాండ్ ఎజ్డీ తన అడ్వెంచర్ బైక్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోటీ పడనుంది. ఎజ్డీ అడ్వెంచర్ పేరుకు తగ్గట్లే అడ్వంచరస్ బైక్. ఎజ్డీ ఐకానిక్ బ్రాండ్ అయినప్పటికీ హిమాలయన్‌తో పోటీ పడక తప్పదు.
ఎజ్డీ అడ్వెంచర్ డిజైన్ కూడా హిమాలయన్ తరహాలోనే ఉంది. ఈ రెండిట్లోనూ ముందువైపు 21 అంగుళాలు, వెనకవైపు 17 అంగుళాలు ఉన్న స్పోక్డ్ వీల్స్‌ను అందించారు. దీంతోపాటు రౌండ్ హెడ్‌ల్యాంప్, పెద్ద విండ్ స్క్రీన్ కూడా రెండిట్లోనూ ఉన్నాయి. ఇక వెనకవైపు డిజైన్, ఫ్యూయల్ ట్యాంక్‌ల్లో రెండిట్లోనూ మార్పులు ఉన్నాయి. కానీ ఓవరాల్ లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉన్నాయి.
హిమాలయన్‌లో పెద్ద ఇంజిన్ అందించారు కానీ ఎజ్డీ అడ్వెంచర్‌లో శక్తివంతమైన ఇంజిన్ ఉంది. హిమాలయన్ బీహెచ్‌పీ 24.3గానూ, టార్క్ 32 ఎన్ఎంగానూ ఉంది. ఎజ్డీ అడ్వెంచర్ బీహెచ్‌పీ 30.2గానూ, టార్క్ 29.9 ఎన్ఎంగానూ ఉంది. హిమాలయన్‌లో 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను అందించగా.. ఎజ్డీలో 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను అందించారు. ఈ అదనపు గేర్ వల్ల బైక్ లైఫ్ మరింత పెరగనుందని కంపెనీ పేర్కొంది.
ఈ రెండిట్లో ఎజ్డీ బరువు తక్కువగా ఉండనుంది. కానీ ఈ రెండు బైకుల గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు ఒకేలా ఉండనుంది. సస్పెన్షన్ విషయంలో కూడా రెండూ ఒకేలా ఉన్నాయి. ఎజ్డీలో పెద్ద ఫ్రంట్ బ్రేక్ అందించారు. పెట్రోల్ ట్యాంక్ కూడా కొంచెం పెద్దగా ఉండనుంది. ఎజ్డీ పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 15.5 లీటర్లు కాగా.. హిమాలయన్ పెట్రోల్ ట్యాంకు సామర్థ్యం 15 లీటర్లుగా ఉంది. రెండిట్లోనూ డ్యూయల్ చానెల్ యాబ్స్‌ను అందించారు.
ఎజ్డీలో ఫుల్ డిజిటల్ క్లస్టర్‌ను అందించారు. ఇక హిమాలయన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ అందించారు. హిమాలయన్‌లో ఎల్ఈడీ లైటింగ్‌ను అందించారు. ఇది ఎజ్డీలో అందుబాటులో లేదు. హిమాలయన్ కంటే ఎజ్డీ ధర కూడా కొంచెం తక్కువగానే ఉంది. హిమాలయన్ ధర రూ.2.14 లక్షలు కాగా.. ఎజ్డీ ధర రూ.2.09 లక్షలుగా ఉంది. అయితే హిమాలయన్ ఈ విభాగంలో సూపర్ హిట్ బైక్ కాగా.. ఎజ్డీ ఇంకా సక్సెస్ కావాల్సి ఉంది.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?