గత రెండు నెలల్లో దేశంలోని ఎన్నో కార్ల బ్రాండ్లు 2022 జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మొదట మారుతి సుజుకి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. హ్యుండాయ్, టాటా మోటార్స్, టొయోటా, సిట్రియాన్ వంటి బ్రాండ్లు తర్వాత ఆ ప్రకటనను చేశాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఫోక్స్‌వాగన్ కూడా చేరింది.


2022 జనవరి 1వ తేదీ నుంచి తమ కార్ల ధరలు రెండు నుంచి ఐదు శాతం వరకు పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. వేర్వేరు మోడళ్లు, వాటి వేరియంట్లను బట్టి ధరల పెంపు ఉంటుందని ఫోక్స్‌వాగన్ తెలిపింది. అయితే ఈ మధ్యే లాంచ్ అయిన ఫోక్స్‌వాగన్ టిగ్వాన్ ధర మాత్రం పెరగబోవడం లేదు.


అయితే ఫోక్స్‌వాగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే ఇటీవలే స్కోడా కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాబట్టి త్వరలో ఫోక్స్‌వాగన్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందని అప్పుడే నిపుణులు అంచనా వేశారు.


ఫోక్స్‌వాగన్ మనదేశంలో ప్రస్తుతం పోలో, వెంటో, టిగ్వాన్ మోడళ్లను విక్రయిస్తుంది. వీటిలో పోలో ఎంట్రీ లెవల్ వాహనం కాగా.. వెంటో మిడ్ రేంజ్‌లో ఉంది. భారతదేశంలో ఫోక్స్‌వాగన్ విక్రయిస్తున్న టాప్ ఎండ్ కారు టిగ్వాన్. ఈ కారు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది.


ఈ సందర్భంగా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తుందన్నారు. వినియోగదారుల మీద తక్కువ ప్రభావం ఉండేందుకు కేవలం రెండు శాతం నుంచి ఐదు శాతం మాత్రమే పెంచుతున్నామని తెలిపారు.


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి