టీవీఎస్ మోస్ట్ సక్సెస్ ఫుల్ అపాచీ బైక్‌లో కొత్త వెర్షన్ వచ్చేసింది. అదే అపాచీ ఆర్‌టీఆర్ 165 ఆర్పీ. దీని ఎక్స్-షోరూం ధర రూ.1.45 లక్షలుగా ఉంది. గతంలో లాంచ్ అయిన అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ ఆధారంగా ఈ కారును రూపొందించారు. అయితే ఇది దాని కంటే ఖరీదైనది. ఇందులో కొత్త ఇంజిన్‌ను అందించారు. దీంతో ఈ విభాగంలో ఇదే అత్యంత ఖరీదైన బైక్ కానుంది. ఇందులో కొన్ని మెకానికల్ చేంజెస్ కూడా చేశారు. దీనికి సంబంధించి కేవలం 200 యూనిట్లు మాత్రమే మనదేశంలో విక్రయిస్తానని టీవీఎస్ తెలిపింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. కాబట్టి కొనాలంటే తొందర పడాల్సిందే.


ఇందులో 164.9 సీసీ సింగిల్ సిలండర్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్‌లో నాలుగు వాల్వులు ఉన్నాయి. దీని బీహెచ్‌పీ 19గానూ, టార్క్ 14 ఎన్ఎంగానూ ఉంది. ఇందులో ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. స్లిప్పర్ క్లచ్‌ను ఇందులో అందించారు. బైక్ వెనకవైపు 240 ఎన్ఎం రేర్ డిస్క్ బ్రేక్ ఉంది. ముందువైపు 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అందుబాటులో ఉంది. అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ కంటే మెరుగైన బ్రేక్ సిస్టంను ఇందులో అందించారు.


రేసింగ్ డెకాల్స్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లీవర్స్, రెడ్ అలోయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, రాగి కోటింగ్ వేసిన చెయిన్, స్ప్రాకెట్, డ్యూయల్ టోన్ బ్లాక్, రెడ్ సీట్ ప్యాటర్న్, వెనకవైపు రేడియల్ టైర్‌లు కూడా ఇందులో ఉన్నాయి.


కంపెనీ మార్కెటింగ్ ప్రీమియం బిజినెస్ హెడ్ మేఘశ్యామ్ దిగోలే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌ను వినియోగదారులకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్పీ సిరీస్‌లో రేస్ మెషీన్లు ఉన్నాయని పేర్కొన్నారు. రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌లో మొదటి వాహనం టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 165 ఆర్పీ అన్నారు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీని అందించినట్లు తెలిపారు.


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి