ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,801 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 94 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,488కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 139 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,539 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1279 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: ఒమిక్రాన్ తీవ్రత తక్కువ, వ్యాప్తి ఎక్కువ... హాస్పిటల్ కేర్ అవసరమయ్యే అవకాశం 70 శాతం తక్కువ... యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడి






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,306కి చేరింది. గడచిన 24 గంటల్లో 139 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,488కు చేరింది. 


Also Read: మహారాష్ట్రలో ఒక్కరోజే 23 ఒమిక్రాన్ కేసులు... భయపెడుతున్న కేసుల సంఖ్య


ఏపీలో ఒమిక్రాన్ కేసులు


ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన 41 ఏళ్ల మహిళతో పాటు విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. తాజాగా కేసులతో ఏపీలో ఒమిక్రాన్ కేసులు 4కు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి, విశాఖకు చెందిన వ్యక్తి ఈనెల 15న యూఏఈ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ క్వారంటైన్‌ ఉన్నారని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి 53 మంది వచ్చారని, వారిలో 9 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని తెలిపింది. తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.


Also Read: ఒమిక్రాన్‌ చికిత్స..! దిల్లీలో పేషెంట్లకు ఇస్తున్న మందులివే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి