Safest Affordable Cars in India: మనదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జనాభా ఎక్కువగా ఉండటం, దీని కారణంగా రోడ్డుపై వాహనాలు ఎక్కువగా ఉండటం, కొన్ని సార్లు అతి వేగం, నిర్లక్ష్యం కారణంగా తరచుగా రోడ్డు ప్రమాదాల వార్తలు మనం వింటూనే ఉంటాం. మనం కరెక్ట్‌గా వెళ్లినా ఎదుటివారు తప్పు కారణంగా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటన్నిటినీ కార్ల కొనుగోలుదారులు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. బడ్జెట్‌లో కారు తీసుకున్నా సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉన్నాయని చూసుకుంటున్నారు. ప్రస్తుతం మనదేశంలో రూ.10 లక్షల్లోపు ధరలో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లు కొన్ని ఉన్నాయి. మహీంద్రా, హ్యుందాయ్, టాటా వంటి బ్రాండ్ల కార్లు ఇందులో ఉన్నాయి. రూ.10 లక్షల్లోపు టాప్ 5 సేఫెస్ట్ కార్లు ఇప్పుడు చూద్దాం.


1. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో సేఫ్టీతో పాటు మంచి డిజైన్ కూడా అందించారు. ఎక్స్‌యూవీ300 తరహాలో దీని డిజైన్ ఉంటుంది. ఇందులో కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందించారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.7.49 లక్షలుగా ఉంది. ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్స్, లెవల్ 2 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా అందించారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీతో సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొనుగోలు చేయడానికి యూజర్లు మొగ్గు చూపుతున్నారు.


2. టాటా పంచ్ (Tata Punch)
భారతీయ మార్కెట్లో సేఫెస్ట్ కార్లు తయారు చేస్తుందని టాటాకు చాలా మంచి పేరు ఉంది. అందుకు టాటా పంచ్ చాలా మంచి ఉదాహరణ. దీని ఎక్స్ షోరూం ధర మనదేశంలో రూ.6.13 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు 5 స్టార్ జీఎన్‌సీఏపీ రేటింగ్‌ను పొందింది. అలాగే పెద్దల సేఫ్టీ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేఫ్టీ కోసం 4 స్టార్ రేటింగ్‌ను ఈ కారు పొందింది. తక్కువ ధరలో మంచి సేఫ్టీ ఫీచర్ ఉన్న కారు కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.


3. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
టాటా ఆల్ట్రోజ్ అనేది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.6.65 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కూడా మంచి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. జీఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఆరు ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవర్, ప్యాసింజర్లకు మంచి సేఫ్టీని అందించనుంది. హ్యాచ్ బ్యాక్ విభాగంలో మంచి సేఫ్టీ ఉన్న ఫీచర్లలో ఈ కారు ముందంజలో ఉంటుంది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


4. టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా మోటార్స్ విక్రయిస్తున్న సేఫెస్ట్ కార్లలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. ఈ ఎస్‌యూవీ కూడా 5 స్టార్ జీఎన్‌సీఏపీ రేటింగ్‌ను పొందింది. దీన్ని బట్టి ఈ కారు మంచి సేఫ్టీ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుందని అనుకోవచ్చు. ఇందులో చాలా సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఈ కారుకు కూడా మనదేశంలో మంచి డిమాండ్ ఉంది.


5. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
హ్యుందాయ్ వెన్యూ కారులో కూడా మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ.7.94 లక్షలుగా ఉంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డ్ సెక్యూరిటీ ఫీచర్‌గా అందించారు. దీంతోపాటు అన్ని వేరియంట్లలోనూ లెవల్ 2 ఏడీఏఎస్ సూట్ కూడా అందించారు. ఈ కారు ఇంకా జీఎన్‌సీఏపీ టెస్టింగ్‌కు వెళ్లలేదు. కానీ ఏఎన్‌సీఏపీ టెస్టులో మాత్రం 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ ధరలో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లలో ఇది కూడా ఒకటి.



Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!