Renault Triber 7 Seater Car: మీరు తక్కువ బడ్జెట్‌తో పాటు కుటుంబం మొత్తానికి సరిపోయే కారు కోసం చూస్తున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. కేవలం రూ. ఆరు లక్షల బడ్జెట్‌లో మంచి సెవెన్ సీటర్ గొప్ప కారు గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాం. ఈ కారు రెనో ట్రైబర్ ఎంపీవీ. ఇది బడ్జెట్ ధరలో అత్యుత్తమ సెవెన్ సీటర్ కారు.


రెనో ట్రైబర్ ధర ఎంత?
రెనో ట్రైబర్ ఎంపీవీ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో వస్తున్న ఈ సెవెన్ సీటర్ కారు గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.


Also Read: మహీంద్రా ఎక్స్‌యూవీ700పై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?


ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీని మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ MPV కారు మొత్తం 10 వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారు లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 84 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సీల్ చేసిన మూడో వరుసను మడతపెట్టడం ద్వారా దీన్ని 625 లీటర్లకు పెంచవచ్చు.


రెనో ట్రైబర్ ఫీచర్లు ఇవే...
ఈ కారులో 14 అంగుళాల ఫ్లెక్స్ వీల్స్ ఉన్నాయి. ఇది పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యుయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్‌ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ వైట్ ఎల్‌ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టైలిష్ ఫాబ్రిక్ అప్‌హోల్స్టరీ, క్రోమ్ రింగ్‌తో కూడిన హెచ్‌వీఎసీ నాబ్‌లు, బ్లాక్ ఇన్నర్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


ఇది కాకుండా పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ట్రైబర్ కారులో అందుబాటులో ఉన్నాయి. 


రెనో ట్రైబర్‌కు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇది భారతీయ వినియోగదారుల మధ్య మంచి పాపులర్ కారు. కానీ 2024 జులైలో మాత్రం దీని సేల్స్ కాస్త తగ్గాయి. 2023 జులైలో దీనికి సంబంధించి 1,802 యూనిట్లు అమ్ముడుపోయాయి. కానీ 2024 జులైలో మాత్రం 1,457 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే 19 శాతం తగ్గిపోయిందన్న మాట. మరి రానున్న నెలల్లో దీనికి సంబంధించిన సేల్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలి.






Also Read: హైబ్రిడ్‌ వెర్షన్‌లో రానున్న ఫేమస్‌ కారు- ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌, మరెన్నో స్మార్ట్‌ ఫీచర్లు