టాటా మోటార్స్ టియాగో, టైగోర్‌ల్లో సీఎన్‌జీ వేరియంట్లను లాంచ్ చేసింది. దీంతో టాటా మోటార్స్ కూడా సీఎన్‌జీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. టియాగో సీఎన్‌జీ ధర రూ.6.1 లక్షల నుంచి రూ.7.65 లక్షల మధ్య ఉండగా.. టిగోర్ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.7.7 లక్షల నుంచి రూ.8.42 లక్షల మధ్య ఉండనుంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.


సీఎన్‌జీ మోడల్స్‌తో పాటు టాటా మోటర్స్ వీటిలో పెట్రోల్ ఓన్లీ వేరియంట్లను కూడా లాంచ్ చేసింది. దీని టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్‌జెడ్+ మోడల్‌లో పెట్రోల్ ఓన్లీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో ఎక్స్‌జెడ్+లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్ బీజ్ ఇంటీరియర్ థీమ్, కొత్త మిడ్‌నైట్ ప్లమ్ కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి.


టాటా టిగోర్ ఎక్స్‌జెడ్+ వేరియంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ బీజ్ ఇంటీరియర్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సబ్ కాంపాక్ట్ టాటా సెడాన్ గ్రూపులో కొత్త మ్యాగ్నెటిక్ రెడ్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.


టాటా కార్ల ధర పెంపు ప్రభావం టియాగో, టిగోర్‌లపై కూడా పడింది. ప్రస్తుతం మనదేశంలో టాగా టియాగో ధర రూ.5.2 లక్షల నుంచి రూ.7.3 లక్షల మధ్య ఉంది. ఇక టిగోర్ ధర రూ.5.8 లక్షల నుంచి రూ.8.12 లక్షల మధ్య ఉంది.


ఈ రెండు కార్లలోనూ 1.2 లీటర్ త్రీ సిలెండర్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ బీహెచ్‌పీ 85 కాగా.. పీక్ టార్క్ 113 ఎన్ఎంగా ఉంది. ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.


Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి