Tata Punch EV on EMI: ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కార్ల తయారీదారులు ఎలక్ట్రిక్ బైక్‌లతో సహా అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేయడానికి ఇదే కారణం. టాటా మోటార్స్ ఈ విభాగంలో ముందంజలో దూసుకుపోవడానికి కృషి చేస్తోంది. మీరు ఈ పండుగ సీజన్‌లో అత్యుత్తమ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ గురించి తెలుసుకోక తప్పదు. ఇది బడ్జెట్‌లో రావడమే కాకుండా మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.


టాటా పంచ్ ఈవీ ఆన్ రోడ్ ధర ఎంత?
ఇంత సేపు మనం చెప్పుకున్నది టాటా పంచ్ ఈవీ గురించి. దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ. 10.4 లక్షల వరకు ఉంటుంది. మీరు ఈ కారును రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అప్పుడు మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 18 వేలు EMI చెల్లించాలి. అయితే కారుపై రుణం పొందడం అనేది మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాటు నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి ఆన్ రోడ్ ధర కూడా మారవచ్చు.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


టాటా పంచ్ ఈవీ స్పెసిఫికేషన్లు, ఇంజిన్
టాటా మోటార్స్... పంచ్ ఈవీ శక్తి కోసం 25 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను ఏసీ ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10 నుండి 100 శాతం, డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.


రేంజ్ ఎంత?
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే పంచ్ ఈవీ 315 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బడ్జెట్‌లో ఈ డ్రైవింగ్ రేంజ్ అంటే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే ఇది గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం పంచ్ ఈవీ గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 9.5 సెకన్లు పడుతుంది. 



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే