Latest dispute between North Korea and South Korea : ప్రపంచం మొత్తం యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ బాంబుల మోత మోగించుకుంటూ ఏళ్లు గడిపేస్తున్నాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో అదే కనిపిస్తోంది. ఎప్పుడు ఎవరు.. ఎవరి మీద దాడి చేస్తారో తెలియడం లేదు. మరో వైపు ఇందులో అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో అది మూడో ప్రపంచయుద్ధంగా ఎప్పుడు మారుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఇన్ మరింత ఆందోళన కలిగించే చర్యలు చేపడుతున్నారు. 


దక్షిణ కొరియా డ్రోన్లు పంపుతోందని ఉత్తర కొరియా అనుమానం         


అణుదేశం కూడా అయిన ఉత్తరకొరియా దక్షిణ కొరియాతో తాజాగా ఉద్రిక్తలు సృష్టించుకుంటూ వస్తోంది. యుద్ధం అంటూ వస్తే దక్షిణ కొరియా తమపై దాడి చేయకుండా ఉండేందుకు రోడ్డు, రైలు మార్గాలను తవ్వేసుకుంటోంది. దక్షిణ కొరియా నుంచి తమ దేశంలోకి వచ్చే మార్గాలన్నింటిన స్వయంగా నాశనం చేసుకుంటోంది. అసలు దక్షిణ కొరియాతో యుద్ధం వస్తుందని కిమ్ ఎందుకు అనుకుంటున్నాంటే.. కొంత కాలంగా డ్రోన్లు తమ దేశంపై ఎగురవేస్తున్నారని ఉత్తరకొరియా అనుమానం.                 


మరో దావూద్‌లా మారేందుకు లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నాలు - 700 మంది షూటర్లను రెడీ చేసుకున్నారా ?


దక్షిణ కొరియాపై చెత్త బెలూన్లు పంపుతున్న ఉత్తర కొొరియా            


పొరుగు దేశం తమపై డ్రోన్లు పంపిస్తోందనే ఆగ్రహంతో కిమ్‌ సర్కారు ఈ చర్యలు చేపడుతోంది. సియోల్‌కు చెందిన డ్రోన్లు తమ గగనతలంలోకి చొరబడినా, కరపత్రాలు జారవిడిచినా, ఆ దేశంపై దాడి చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసింది. శతఘ్ని దళం సహా ఇతర కీలక యూనిట్లను ఇప్పటికే సరిహద్దుల్లోకి పంపామని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఉత్తరకొరియా తరచూ చెత్త బెలూన్లను దక్షిణ కొరియా వైపు పంపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6,000 బెలూన్ల పంపినట్లుగా తెలుస్తోంది. ఈ బెలూన్ల కారణంగా  జూన్‌ నుంచి తమ రాజధాని సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా ఆరోపించింది.  


Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం


యుద్ధానికి ఏర్పాట్లు చేసుకున్న కిమ్              


దక్షిణ కొరియా కూడా డ్రోన్లలో కరపత్రాలు ఉంచి ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో వెదజల్లిస్తోందని ఉత్తరకొరియా ఆరోపిస్తోంది. తమ దేశంపై దాడి చేయడానికి దక్షిణ కొరియా ఏర్పాట్లు చేసుకుంటోందని అనుమానిస్తున్నారు. ఒకప్పుడు కొరియాగానే ఉండే దేశం తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. ఉత్తరకొరియా నియంత పాలనలో ఉండగా దక్షిణ కొరియా ప్రజాస్వామ్యంలోకి వెళ్లింది. అభివృద్ధి పథంలో కొరియా ఉంది. కానీ ఉత్తరకొరియా మాత్రం కరువు కాటకాలతో ఉంటుంది. ఈ వివాదాలతో మరోసారి కొరియాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.