3 Economists Share 2024 Nobel Memorial Prize in Economic Sciences : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజును ముగ్గురుకు ప్రకటించారు. డారెన్ ఎస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ లకు సంయుక్తంగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజు ప్రకటించారు. సమాఖ్యల మధ్య సంపద అంతరాల గురించి వీరు పరిశోధన చేశారు. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్స్ ఈ అవార్డును రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఆఫ్ ఎకనమిక్స్ పేరుతో నోబెల్ గౌరవార్థంగా ప్రకటిస్తోంది.
దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరగడానికి కారణాలు ఏమిటన్నదానిపై సమగ్రంగా వీరు చర్చించారు. ఆయా దేశాల్లోని పరిస్థితుల కన్నా ఆర్థిక సంస్థలు.. ఆర్థిక వ్యవస్థ తీరును ఎక్కువగా ప్రభావితం చేస్తాయని వీరు పరిశోధనా పూర్వకంగా వెల్లడించారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రధానం చేస్తున్నారు. భారత్ నుంచి అమర్త్య సేన్ నోబెల్ బహుమతి అందుకున్నారు. అలాగే ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్ కూడా సూక్ష్మ బ్యాంకింగ్ వ్యవస్థను సృష్టించడం ద్వారా నోబెల్ అందుకున్నారు. సాధారణంగా ఒక్కో ఆర్థిక వేత్తకే అవార్డు ఇస్తూంటారు. కానీ కలిసి పరిశోధనలు చేసినప్పుడు ఇరవై సార్లు ఇద్దరికి ఇచ్చారు. ముగ్గురికి కలిపి ఇవ్వడం ఇది పదో సారి మాత్రమే.
Also Read: Nobel Prize 2024: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్, ప్రొటీన్ పై పరిశోధలకు అత్యున్నత పురస్కారం
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఈ సారి జపాన్‌కు చెందిన నిహాన్ హిదాన్‌క్యో అనే సంస్థకు ప్రకటించారు. ప్రపంచానికి అణుబాంబుల వల్ల ఎంతో ముప్పు ఉందని..అందుకే అణు అయుధాలులేకుండా చేసేందుకు ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. జపాన్ పై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుయుద్ధాలు జరిగాయి. వాటిబారిన పడిన వారు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి బాధితులకు ఈ సంస్థ ఎన్నో సేవలు చేస్తోంది. ఆ సేవలను గుర్తింంచచిన నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ఈ ఏడాది నిహాన్ సంస్థకు ప్రకటించాలని నిర్ణయించింది.