Gangster Lawrence Bishnoi is trying to become another Dawood Ibrahim : ముంబైలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్‌గా ఉన్న  బాబా సిద్దిఖీని చంపేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. మరో గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్‌తో కలిసి నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు లారెన్స్ బిష్ణోయ్. వరుసగా నేరాలు చేస్తూ వేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ద్వారా నేర సామ్రాజ్యాన్ని దావూద్ ఇబ్రహీం రేంజ్‌కు విస్తరించాలని ప్రణాళికలు వేసుకున్నాడు. 


దావూద్ కానిస్టేబుల్ కొడుకు - బిష్ణోయ్ కూడా కానిస్టేబుల్ కొడుకు


ముంబైలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు అయిన దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యంలో ఎక్కడి వరకూ వెళ్లాడో అందిరికీ తెలుసు. ఒక్క సారిగా దావూద్ గ్యాంగ్ స్టర్ కాలేదు. కింది స్థాయి నేరాలతో ప్రారంభించి.. దోపిడీలు, హత్యలు దేన్నీ వదిలి పెట్టలేదు. లారెన్స్ బిష్ణోయ్ కూడా హర్యానాలోని ఓ కానిస్టేబుల్ కుమారుడే.అయితే చిన్న తనంలోనే దారి తప్పాడు. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లతో రెచ్చిపోయాడు. గోల్డీ బ్రార్ తో కలిసి హత్యలు చేసే వరకూ వెళ్లాడు. పంజాబ్ ప్రముఖ సింగర్ సిద్దమూసేవాలా హత్యలోనూ బిష్ణోయ్ పేరు వినిపించింది. తరవాత గోల్డీ బ్రార్ పేరు బయటకు వచ్చింది. 


15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!


బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్న లారెన్స్ బిష్ణోయ్


తర్వాత లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల వ్యవహారం ఆయనను భయపెట్టానికేనని ప్రచారం జరిగింది.  ఓ బిగ్ టార్గెట్ ను షూట్ చేయకపోతే భయం ఉండదని అనుకుని... వివిధ సెటిల్మెంట్లను కూడా చూసుకుని బాబా సిద్దిఖీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో దావూద్ ఇబ్రహీం కూడా ఇలాగే బాలీవుడ్‌ను టార్గెట్ చేసేవారు. పలువురిపై ఎటాక్స్ చేయించారు. చివరికి  బాలీవుడ్ మొత్తాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు. తర్వాత మెల్లగా మాఫియా కబంధ హస్తాల నుంచి బాలీవుడ్ బయటపడింది. అయితే ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ ఆ స్తానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. 


బిష్ణోయ్ గ్యాంగ్ నెట్ వర్క్ ఎంత ?


లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు ఉన్న నెట్ వర్క్ ఎంత అన్నది చర్చనీయాంశమయింది. కనీసం ఏడు వందల మంది షూటర్లతో ఓ నెట్ వర్క్ ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఆయుధాలను కూడా విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకుంటారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కెనడా నుంచి వీరి గ్యాంగ్ కు సంబందించి కీలక నిర్ణయాలు జరుగుతూ ఉంటాయని.. ఇక్కడి షూటర్లకు అక్కడి నుంచే ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నారు. 


Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం


జైల్లో లారెన్స్ బిష్ణోయ్ 


ఇంత జరుగుతూంటే లారెన్స్ బిష్ణోయ్ బయట ఉన్నారని అనుకుంటారు. కానీ ఆయనను అరెస్టు చేసి చాలా కాలం అయింది. తీహార్ జైల్లో ఉన్నారు. ఎన్ఐఏ విచారణలో బిష్ణోయ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా తేలింది ఆ మేరకు చార్జిషీటు కూడా దాఖలు చేశారు. జైల్లో ఉండే నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.  బిష్ణోయ్ హవా ఇలాగే ఉంటే మరో దావూద్ లా మారుతాడని..ఆయనను... ఆయన గ్యాంగ్‌ను మొదట్లోనే ఏరి వేయాలన్న సూచనలు ఎక్కువగా రక్షణ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.