Arthamainda ArunKumar Season2 Streaming Dates: తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో విడుదలైన మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌'. ఈ వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపుగా రెండో సీజన్ రాబోతోంది.  తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు “కొత్త సీజన్, కొత్త కష్టాలు, సరికొత్త పాత్రలు.. 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' సీజన్ 2 స్ట్రీమింగ్ అక్టోబర్ 31 నుంచి ఆహాలో మాత్రమే” అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. తొలి సీజన్ కు మాంచి క్రేజ్ లభించడంతో రెండో సీజన్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.


గతేడాది విడుదలైన 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌'


కామెడీ డ్రామాగా రూపొందిన 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' వెబ్ సిరీస్ గత ఏడాది జూన్ 30న ఆహాలో విడుదల అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో అనన్య శర్మ, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అదిరిపోయే కామెడీతో అందరినీ అలరించారు. ఇప్పుడు దానికి మరింత ఫన్, ఎమోషన్స్ ను జోడిస్తూ రెండో సీజన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు జోనాథన్‌  దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.    


మరింత క్రేజీగా 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్


'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' అనే వెబ్ సరీస్ ఓ పల్లెటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి కార్పొరేట్ ఆఫీసులో ఇబ్బందులు పడే యువకుడి చుట్టూ తిరుగుతుంది. కార్పొరేట్ జీవితం ఎలా ఉంటుంది? పల్లెటూరి యువకుడు ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనేది చూపించారు. ఈ వెబ్ సిరీస్ యువతను బాగా ఆకట్టుకుంది. ఆహాలో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఫస్ట్ సీజన్ లో హర్షిత్, అనన్య, తేజస్వి,వాసు ఇంటూరి, జై ప్రవీణ్‌, శ్రావ్య మృదుల కీలక పాత్రల్లో నటించారు. ఇక 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ ను మరింత క్రేజీగా రూపొందించినట్లు తెలుస్తోంది.


రెండో సీజన్లో మెయిన్ లీడ్​గా పవన్ సిద్ధూ చేస్తున్నారు. గత సీజన్​లో హర్షిత్ ఈ పాత్రలో అద్భుతమైన పర్​ఫార్మెన్స్ ఇచ్చారు. మరి ఈ సీజన్​లో సిద్ధూ ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే. పవన్ సిద్ధూ కూడా ఎన్నో యూట్యూబ్ సిరీస్​లో నటించారు. సీరియల్స్​, పలు టీవీ కార్యక్రమాల్లో కనిపించి ప్రజలను ఎంటర్​టైన్ చేశారు. ఇప్పుడు అర్థమైందా అరుణ్ కుమార్​లో ఎలా నటిస్తాడో చూడాలి. అయితే అరుణ్ కుమార్ కు జాబ్​లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఇందులో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను అరీ స్టూడియోస్‌, లాఫింగ్‌ కౌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై బి.సాయికుమార్‌, తన్వి దేశాయ్‌ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజయ్‌ అరసాడ మ్యూజిక్ అందిస్తున్నారు.  


Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??






Also Readరీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా సినిమా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?