Maruti Suzuki Wagon R New Edition Price: మారుతి సుజుకి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను 'వోల్ట్జ్ ఎడిషన్' పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ.5.65 లక్షలుగా నిర్ణయించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఈ ఎడిషన్ కొన్ని కొత్త ఫీచర్లు, విజువల్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.
వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్‌లో ప్రత్యేకత ఏమిటి?
వ్యాగన్ ఆర్ వోల్ట్జ్ ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు చేశారు. ఇందులో ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కోసం క్రోమ్ గార్నిష్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మోల్డింగ్, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ ట్రీట్‌మెంట్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ ఎడిషన్‌కు 6.2 అంగుళాల టచ్‌స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా జోడించారు.
ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ఎన్ని యూనిట్లను తయారు చేస్తారు లేదా ఎంతకాలం విక్రయానికి అందుబాటులో ఉంటుందో మారుతి వెల్లడించలేదు. వోల్ట్జ్ ఎడిషన్ ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్‌ల ధరలు ఇంకా వెల్లడించలేదు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మారుతి వ్యాగన్ ఆర్ ఇంజిన్, ఫీచర్లు ఇలా...
మారుతి వ్యాగన్ ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0 లీటర్ త్రీ సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 67 హెచ్‌పీ, 89 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారులో మరొక ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. రెండో ఇంజన్ 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 90 హెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండు ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్, ఆప్షనల్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా 1.0 లీటర్ ఇంజన్ కూడా సీఎన్‌జీ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్‌తో ఏ కార్లు పోటీ పడతాయి?
మారుతి వ్యాగన్ ఆర్ వోల్ట్జ్ ఎడిషన్ ప్రధానంగా టాటా టియాగో, సిట్రోయెన్ సి3 వంటి కార్లతో పోటీపడుతుంది. ఇది కాకుండా మారుతి సెలెరియో కూడా దీనికి గట్టి పోటీని ఇవ్వనుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ బేస్ మోడల్ న్యూ ఎడిషన్ మోడల్ కంటే చవకగా ఉంటుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే