TATA Car July Discounts : టాటా కారు కొనాలనుకుంటున్న వారి కోసం కంపెనీ జూలై నెలలో కొన్ని డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ వాహనాలపై ఈ డిస్కౌంట్లు ప్రకటించారు. జూన్ నెలలో అల్ట్రోజ్, పంచ్, నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ వాహనాలపై డిస్కౌంట్లు ఇచ్చారు. వాటికి వినియోగదారుల నుంచి అత్యధిక డిమాండ్ వచ్చింది. ఈ సారి వాటిపై డిస్కౌంట్లు లేవు. వాటి డెలివరి టైం కూడా ఎక్కువగా ఉండటంతో కంపెనీ డిస్కౌంట్ ఆఫర్స్‌ను తీసేసింది.
కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
టాటా హ్యారియర్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి గరిష్టంగా అరవై వేల వరకూ తగ్గింపు పొందే సౌకర్యాన్ని టాటా మోటార్స్ కల్పించింది. అదే కార్పొరేట్ కొనుగోలుదారులు అయితే మరో ఇరవై వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. టాటా సపారి వాహనం మీద రూ. నలభై వేల డిస్కౌంట్ ప్రకటించారు. అన్ని వేరియంట్ల మీద డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. టాటా టియోగో కొనుగోలుదారులకు గరిష్టంగా రూ. 31500 ప్రయోజనం పొందేలా ఏర్పాట్లు చేశారు. టాటా టిగోర్ కొనుగోలు చేయాలనుకునేవారికీ అదే స్థాయిలో ప్రయోజనం కలగనుంది. అన్ని వేరియంట్లకూ ఈ సౌకర్యం వర్తిస్తుంది. టాటా నెక్సాన్ పై మాత్రం అతి తక్కువగా రూ. పదివేలు మాత్రమే తగ్గింపు లభిస్తుంది.
ఏడు నెలలకోసారి చార్జింగ్ పెడితే చాలు - సోలార్ పవర్‌తో నడిచే సూపర్ కారు!
టాటామోటార్స్ ప్రతీ నెలా కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఎక్సేంచ్ ఆఫర్లు కూడా ఇస్తూంటుంది. టాటా మోటార్స్ వాహన రంగంలో దూసుకెళ్తుంది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో వాహనాల విక్రయాలు ఏకంగా 82 శాతం పెరిగాయి. గత ఏడాది జూన్‌లో 79, 606 వాహనాలను అమ్మితే ఈ ఏడాది జూన్‌లో వాటి సంఖ్య 43, 704కి చేరింది. ఇది పూర్తిగా డొమెస్టిక్ విక్రయాలు. డొమెస్టిక్ ప్యాసింజర్ విభాగంలో అత్యధికంగా అమ్మకాలు నమోదవుతున్నాయి. ఈ డిమాండ్ కొనసాగుతుదని టాటా మోటార్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.