ప్రస్తుతం మనదేశంలో 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఆ జాబితాలో చేరనుంది. గతంలో వచ్చిన కోడియాక్ ప్రీమియం ఎస్‌యూవీకి అప్‌డేట్‌గా ఈ కొత్త కోడియాక్ రానుంది. ఇందులో మూడు వేరియంట్లు ఉండనున్నాయి. అవే స్టైల్, స్పోర్ట్‌లైన్, లారిన్ అండ్ క్లెమెంట్ స్టైల్.
ఈ కారు ధర రూ.34.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో అందించనున్న పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను కూడా ఇందులో అందించారు. అదే 2.0 టీఎస్ఐ ఇంజిన్‌ను అందించారు. స్టాండర్డ్ వేరియంట్‌లో 7-స్పీడ్ డీఎస్‌జీని అందించనున్నారు.
దీని ముందు వెర్షన్‌లో డీజిల్ ఇంజిన్‌ను అందించారు. కొత్త కోడియాక్‌లో డైనమిక్ చాసిస్ కంట్రోల్ (డీసీసీ)ని అందించారు. డీసీసీ ద్వారా డ్రైవర్ ఎకో, కంఫర్ట్, స్పోర్ట్స్, స్నో, ఇండివిడ్యువల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. కోడియాక్‌లో హెక్సాగోనల్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, కొత్త డీఆర్ఎల్ సిగ్నేచర్ అందించడం ద్వారా చాలా అప్‌గ్రేడ్లు చేశారు.
దీని వెనకవైపు డైనమిక్ టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక 7-సీటర్ కారు. ఇందులో అప్‌డేట్ చేసిన కేబిన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది. ఇందులో 12-వే అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్లను అందించారు. మై స్కోడా కనెక్ట్ యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, 9 ఎయిర్‌బ్యాగ్స్, అడాప్టివ్ లైట్స్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, 360 డిగ్రీ కెమెరా, 12-స్పీకర్ ఆడియో సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ప్రస్తుతానికి ఈ ధరలో 7-సీటర్ ప్రీమియం పెట్రోల్ ఎస్‌యూవీ ఇదొక్కటే. దీనికి పోటీ కూడా లేవు.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?