ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీల హవా నడుస్తూ ఉండవచ్చు. కానీ సెడాన్‌లు మాత్రం ఇప్పటికీ మార్కెట్లో తమ ఉనికిని కాపాడుకుంటూనే ఉన్నాయి. స్కోడాకు ఆక్టేవియా అంటే ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే మనదేశంలో లాంచ్ అయిన మొదటి స్కోడా కారు ఇదే. చాలా మందికి ఇప్పటికీ స్కోడా అంటే ఆక్టేవియానే గుర్తొస్తుంది.


గతేడాది స్కోడా మనదేశంలో కొత్త ఆక్టేవియా కారును లాంచ్ చేసింది. దీని పొడవు 4.7 మీటర్లుగా ఉంది. కారు పొడవు చాలా ఎక్కువ ఉందని అనుకోవచ్చు. కారు ముందువైపు పెద్ద గ్రిల్ ఉంది. 17 అంగుళాల అలోయ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ కారు చూడటానికి లగ్జరీ కారు తరహాలో ఉంది.


స్కోడా కార్లు అన్నిటిలాగానే ఈ కారు కూడా సాలిడ్‌గా ఉంది. అయితే కారు ఇంటీరియర్ ఇంకా బాగుంది. కారు లేఅవుట్ చాలా మినిమలిస్టిక్‌గా ఉంది. తక్కువ కంట్రోల్స్‌తో క్లీన్‌గా ఉంది. దీనికి ముందు తరం ఆక్టేవియాతో పోలిస్తే.. క్వాలిటీ విషయంలో, ఉపయోగించిన మెటీరియల్స్‌లో చాలా మార్పు ఉంది. ఇందులో టూ స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించారు. దీని లుక్ చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంది. దీని సెంటర్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంది. గేర్ నాబ్‌ను ఇందులో అందించలేదు. చిన్న టాగిల్ స్విచ్ ఇందులో ఉంది. పోర్షే 911 తరహాలో షిఫ్ట్ టు వైర్ టెక్నాలజీని ఇందులో అందించారు.


దీని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. టచ్ స్క్రీన్ కంట్రోల్స్ చదవడం కూడా చాలా సులభం. టచ్ రెస్పాన్స్ కూడా చాలా వేగంగా ఉంది. మరిన్ని ఫిజికల్ కంట్రోల్స్ ఉంటే బాగుండేది. దీని టచ్ స్లైడర్ ఫంక్షన్‌కు కాస్త సమయం పడుతుంది. అయితే పోను పోను అది అలవాటు అవుతుంది. దాన్ని ఉపయోగించడం చాలా సులభం కూడా.


ఇందులో 12 స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టం, టూ జోన్ క్లైమెట్ కంట్రోల్, నాలుగు యూఎస్‌బీ-టైప్ సీ పోర్టులు, రోలర్ సన్ బ్లైండ్లు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, లెదర్ సీట్లు కూడా ఉండనున్నాయి. అయితే ఇందులో సన్ రూఫ్ అందించలేదు.


ముందు తరం ఆక్టేవియాతో పోలిస్తే... ఇందులో ఎక్కువ స్పేస్ ఉంది. సీట్లు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఈ కారు లెగ్‌రూం/హెడ్‌రూం కూడా చాలా ఎక్కువగా ఉంది. దీని లగేజ్ స్పేస్ 600 లీటర్లుగా ఉంది. వెనకవైపు సీట్లను కూడా పైకి లేపితే 1,555 లీటర్లుగా ఉండనుంది.


ఇందులో ఐదో డోర్ కూడా ఉంది. దాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ కారులో మొత్తంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. మైస్కోడా కనెక్ట్ యాప్ ద్వారా ఈ కారు టైర్ ప్రెజర్‌ను మానిటర్ చేయవచ్చు. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. స్మూత్ లగ్జరీ కారులాగా ఇది చాలా స్టార్ట్ కానుంది.


ఈ కారు లీటరుకు 10 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ఈ కొత్త ఆక్టేవియా ప్రీమియం లగ్జరీ కారు. దీని ధర రూ.26 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది కొంచెం ఎక్కువ ధరే కానీ.. ఆక్టేవియా కూడా చాలా పెద్దది.


Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి