New Bajaj Pulsar Launch: బజాజ్ ఆటో తన కొత్త పల్సర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ బైక్‌ను పండుగ సీజన్‌లో అక్టోబర్ 16వ తేదీన కంపెనీ లాంచ్ కానుందని తెలుస్తోంది. మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కొత్త బైక్ బజాజ్ పల్సర్ ఎన్125 కావచ్చని తెలుస్తోంది. బైక్ తయారీ కంపెనీకి చెందిన ఎన్ సిరీస్ కూడా మార్కెట్‌లో విజయాన్ని సాధించింది. దీంతో పాటు ఈ సిరీస్ బైక్‌లు అత్యంత చవకైన మోటార్‌సైకిళ్ల విభాగంలో వస్తాయి.
బజాజ్ కొత్త బైక్‌లో ప్రత్యేకత ఏమిటి?
బజాజ్ తన కొత్త పల్సర్‌ను ఫన్, అర్బన్ బైక్‌గా విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ బైక్ కొంచెం తక్కువ కెపాసిటీతో రావచ్చు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇది పల్సర్ ఎన్125 కావచ్చు. ఈ కొత్త బజాజ్ బైక్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌ల్యాంప్‌లు ఉండవచ్చు. బైక్‌లో ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా అందించవచ్చని సమాచారం.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
పల్సర్ ఎన్125 టాప్ ఫీచర్లు
బజాజ్ పల్సర్ ఎన్125 బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందవచ్చు. కంపెనీ ఈ బైక్‌లో స్ప్లిట్ సీటును అందించగలదని తెలుస్తోంది. బైక్ వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. కొత్త బజాజ్ పల్సర్ 125 సీసీ, సింగిల్ సిలిండర్ మోటార్‌తో రావచ్చు. ఈ బైక్‌ను 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. బైక్‌లో స్పోర్ట్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉండవచ్చు. అదే సమయంలో ఈ బైక్ టాప్ వేరియంట్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ని చూసే అవకాశం ఉంది.
బజాజ్ పల్సర్‌కు కాంపిటీషన్ ఇవే...
భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ 125 డిస్క్ ఎక్స్ షోరూమ్ ధర రూ.92,883 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ ఎన్ సిరీస్‌లో వస్తే దాని కొత్త మోడల్ ఏ రేంజ్‌లో మార్కెట్లోకి ప్రవేశిస్తుందో చూడాలి. బజాజ్ పల్సర్ ఎన్125 లాంచ్ అయిన వెంటనే అనేక బైక్‌లతో పోటీ పడగలదు. ఈ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, టీవీఎస్ రెయిడర్ 125, బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీలకు ప్రత్యర్థిగా మారవచ్చు.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?