బీఎండబ్ల్యూ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసిన బ్రాండ్లలో చేరింది. తన కొత్త కారు ఐఎక్స్‌తో బీఎండబ్ల్యూ ఇందులో ఎంట్రీ ఇచ్చింది. ఐఎక్స్ కొత్త ఎస్‌యూవీ కాదు కానీ సాధారణ బీఎండబ్ల్యూ కార్లకు కాస్త భిన్నంగా ఉంది. ఇది ఒక ఫ్లాగ్ షిప్ ఎస్‌యూవీ కారు. ఈ కారును చాలా తెలివిగా రూపొందించారు. దీని ఇంటీరియర్ కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉండనుంది.


ఈ కారు ఎక్స్5 సైజులో ఉంది. కానీ దీని లుక్ మాత్రం చాలా బాగుంది. ఇందులో పెద్ద గ్రిల్ కూడా ఉంది. ఈ గ్రిల్ కెమెరా, సెన్సార్లు, రాడార్లను కూడా కవర్ చేయనుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను ఇందులో అందించారు. సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులు, టెయిల్ ల్యాంపులు ఇందులో ఉన్నాయి.


ఇంతకుముందు మీరు బీఎండబ్ల్యూలో కూర్చుంటే.. దాని అనుభవానికి, దీని అనుభవానికి చాలా తేడా ఉంటుంది. ఇంటీరియర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఎక్స్5తో ఏమాత్రం సంబంధం లేకుండా కొత్తగా దీన్ని డిజైన్ చేశారు. దీని హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్ చూడటానికి చాలా కొత్తగా ఉంది. ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, పెద్ద డిస్‌ప్లేలు కూడా ఇందులో ఉన్నాయి.


ఇందులో రా మెటీరియల్స్ కానీ, అరుదైన లోహాలను కానీ బీఎండబ్ల్యూ ఉపయోగించలేదు. పూర్తిగా రీసైకిల్ చేసిన చేసిన మెటీరియల్‌తోనే దీన్ని రూపొందించారు. ఇంటీరియర్‌లో సహజమైన లెదర్‌ను ఉపయోగించారు. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగించారు. దీంతోపాటు మధ్యలో 14.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లే కూడా ఉంది. కస్టమైజబుల్ మెనూలు, ఎన్నో ఆప్షన్లు కూడా ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. 


హెడ్స్ అప్ డిస్‌ప్లే, రివర్స్ అసిస్టెంట్, 18 స్పీకర్ల హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టంను ఇందులో అందించారు. ఈ కారు గెస్చర్లను కూడా గుర్తిస్తుంది. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. యాంబియంట్ లైటింగ్ ఫీచర్ కూడా ఇందులో అందించారు.


ఇందులో 76.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది 425 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ అంటోంది. కానీ బయట మాత్రం 300 కిలోమీటర్లకు కొంచెం ఎక్కువ ఇవ్వనుంది. అది మీరు డ్రైవ్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు 150కేడబ్ల్యూ డీసీ చార్జర్‌ను ఉపయోగిస్తే 10 నిమిషాల్లో, డీసీ చార్జర్‌ను ఉపయోగిస్తే 20 నిమిషాల్లో 100 కిలోమీటర్లకు సరిపడా చార్జ్ కానుంది. స్టాండర్డ్ ఏసీ చార్జర్‌తో అయితే పూర్తిగా చార్జ్ కావడానికి ఏడున్నర గంటలు పట్టనుంది. వాల్ బాక్స్ చార్జర్‌ను కార్‌తో పాటు అందించనున్నారు. బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద ఫాస్ట్ చార్జర్లు లభించనున్నాయి.


దీని ధర రూ.1.15 కోట్ల వరకు ఉంది. ఇది ఒక యునిక్ ఎస్‌యూవీ కారు. కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా ఎకో ఫ్రెండ్లీ అవుట్‌లుక్ కూడా దీంతోపాటు అందించారు. ఇందులో మంచి ఇంటీరియర్‌ను అందించారు. చూడటానికి స్పేస్‌షిప్ తరహాలో దీని డిజైన్ ఉండటం విశేషం. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిందనే చెప్పవచ్చు.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి