మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7 మంది ముంబయికి చెందిన వారు కాగా, ఒకరు వసాయి విరార్‌కు చెందినవారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 28 మందికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. కొత్తగా ఒమిక్రాన్ సోకిన వారు ఇటీవల విదేశీ ప్రయాణం చేయనివారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 9 మంది RT-PCR పరీక్ష నెగిటివ్‌గా వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 


Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?






Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్


మహారాష్ట్రలో కరోనా కేసులు
మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 684  కరోనా కేసులు నమోదయ్యాయి. 686 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 24 మరణాలు నమోదయ్యాయి.



  • మొత్తం కేసులు 66,45,136

  • మొత్తం రికవరీలు 64,93,688

  • మరణాల సంఖ్య 1,41,288

  • యాక్టివ్ కేసులు 6481


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు


దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి పెరిగింది. మహారాష్ట్రలో కొత్తగా మరో ఎనిమిది ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 28కి చేరాయి. వీరిలో 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. 


Also Read:  దేశంలో 49కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. దిల్లీలో కొత్తగా నలుగురికి


Also Read: Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో పెరుగుతోన్న వ్యాప్తి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి