Best Cars For City Drive: ఇండియన్ సిటీల్లో కారు డ్రైవ్ చేయడం అంత వీజీ కాదు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు కొన్ని సార్లు తలనొప్పిగా పరిణమిస్తాయి కూడా. మంచి ఫీచర్లు అందించే చిన్న కార్లు ఇటువంటి పరిస్థితుల్లో బాగా ఉపయోగపడతాయి. అదృష్ణవశాత్తూ మనదేశంలో అటువంటి కార్లకు ఎటువంటి కొదవా లేదు. ఇప్పుడు మనం రూ.10 లక్షల్లోపు ధరలో సిటీ డ్రైవింగ్‌కు అనువుగా ఉండే బెస్ట్ కార్లు ఏవో చూద్దాం. ఈ లిస్టులో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంజీ, సిట్రోయెన్ వంటి కంపెనీల కార్లు ఉండటం విశేషం.


మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
మారుతి సుజుకి సెలెరియో కారు ఈ లిస్ట్‌లో ముందంజలో ఉంటుంది. ఈ చిన్న, క్యూట్ హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ.5.36 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఎక్స్ షోరూం ధర. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.7.64 లక్షలుగా ఉంది. ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ త్రీ సిలండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 65 హెచ్‌పీ, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అన్ని వేరియంట్లోనూ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఈ కారు 26.68 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ అంటోంది.


టాటా టియాగో (Tata Tiago)
సిటీ లైఫ్‌లో ఒక కారు వాడాలనుకుంటే టాటా టియాగో కూడా ఒక మంచి ఆప్షన్. దీని ఎక్స్ షోరూం ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం అయి రూ.6.99 లక్షల వరకు ఉంటుంది. టాటా టియాగోలో 1.2 లీటర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 84 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏఎంటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 20.09 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.


హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
సిటీలో తిరగడానికి ఈ కారు కూడా ఒక మంచి ఆప్షన్. మంచి ఫీచర్లతో ప్రీమియం లుక్‌లో ఉండే కార్లలో ఇది కూడా ఒకటి. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.92 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.8.56 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. 82 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఈ కారు జనరేట్ చేయనుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 20.07 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేయనుంది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


సిట్రోయెన్ సీ3 (Citroen C3)
రోజూ సిటీల్లో తిరిగే వారికి సిట్రోయెన్ సీ3 కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.6.16 లక్షల నుంచి రూ.10.11 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ అందించారు. ఇది నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. 80 హెచ్‌పీ పవర్, 115 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది డెలివర్ చేయనుంది. టర్బోఛార్జ్‌డ్ వెర్షన్ కూడా ఈ ఇంజిన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 108 హెచ్‌పీ పవర్, 190 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది డెలివర్ చేయనుంది. ఈ కారు 18.3 కిలోమీటర్ల నుంచి 19.3 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించనుందని కంపెనీ అంటోంది.


ఎంజీ కామెట్ (MG Comet)
ఈ లిస్టులో ఉన్న ఒకే ఒక్క ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. డిజైన్ కొత్తగా ఉండే కాంపాక్ట్ ఈవీ ఇది. దీని ఎక్స్ షోరూం ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.48 లక్షలుగా ఉంది. ఎంజీ కామెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 41 హెచ్‌పీ పవర్‌ని, 110 ఎన్ఎం పీక్ టార్క్‌ని డెలివర్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఇది 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. కాబట్టి సిటీల్లో దీన్ని సులభంగా ఉపయోగించవచ్చని చెప్పవచ్చు. 



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే